బర్త్‌ డే పార్టీకి వెళ్లలేదో... జాగ్రత్త!

Update: 2015-01-20 19:30 GMT
హెల్‌మెట్‌ పెట్టుకోలేదనో, తాగి డ్రైవ్‌ చేసారనో, సిగ్నల్స్‌ వెయ్యకుండానే రోడ్‌ క్రాస్‌ చేశారనో... సాధారణంగా మన దేశంలో అయితే ఇటువంటి వాటికి ఫైన్స్‌ వేస్తుంటారు! అయితే... ఒక బర్త్‌ డే పార్టీకి పిలిస్తే రాలేదని జరిమానా విధించిండం లేదా పరిహారం కోరడం ఎప్పుడైనా విన్నారా? తాజాగా యునైటెడ్‌ కింగ్‌డమ్‌లో ఈ వింత సంఘటనే చోటు చేసుకుంది! తన కొడుకు పుట్టిన రోజు వేడుకలకు పిలిస్తే రాలేదని, రాని విషయాన్ని ముందుగా చెప్పలేదనే కారణంతో ఓ మహిళ ఐదేళ్ల బాలుడికి రూ. 1500 జరిమానా విధించింది! అంతేగాక చట్టపరమైన చర్యలు తీసుకుంటానని బెదిరించింది!

వివరాల్లోకి వెళితే...  తన పుట్టిన రోజు వేడుకలకు రమ్మని అలెక్స్‌ నాష్‌ అనే బాలుడికి అతని ఫ్రెండ్‌ నుంచి పిలుపువచ్చింది! అయితే... అలెక్స్‌ ఆ పార్టీకి వెళ్లలేదు! దీంతో పార్టీకి పిలిచిన బాలుడి తల్లి, లారెన్స్‌ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు! అలెక్స్‌ రాకపోవడం వల్ల తనకు అనవసరంగా పెద్ద మొత్తంలో ఖర్చయిందని, చాలా అవమానంగా ఫీలయ్యమని, రావట్లేదన్న విషయాన్ని అయినా కనీసం ముందుగా ఎందుకు చెప్పలేదని ప్రశ్నిస్తూ... పార్టీ రానందుకు గానూ తాము ఖర్చు చేసిన రూ. 1500 (16 పౌండ్లు) చెల్లించాలని అలెక్స్‌కు ఓ ఇన్వాయిస్‌ పంపింది! ముందుగా ఆశ్చర్య పోయినా, తర్వాత తేరుకుని... ఇంతే ఆవేశంగా స్పందించాడు అలెక్స్‌ తండ్రి! ఈ విషయాన్ని తాను కోర్టులోనే తేల్చుకుంటానని, ఆ డబ్బు ఆమెకు చెల్లించేది లేదని తేల్చి చెప్పేస్తొన్నాడు! అలెక్స్‌ తన నాయనమ్మ, తాతయ్యలతో గడపాల్సి వచ్చిందని, అందుకే ఆ పార్టీకి వెళ్లలేకపోయాడని ఈ విషయాన్ని చెబుదామంటే లారెన్స్‌ ఫోన్‌ నెంబర్‌ తమ వద్ద లేదని సంజాయిషీ చెబుతున్నాడు!

అయినా కూడా శాంతించని బర్త్‌ డే బాయ్‌ తల్లి... తాము ఇచ్చిన ఇన్విటేషన్‌లోనే కాంటాక్ట్‌ నెంబర్‌తో సహాఅన్ని వివరాలు ఉన్నాయని, కావాలనే ఆ పార్టీకి రాలేదని... అందుకు జరిమానా చెల్లించాల్సిందే అని వాదిస్తోంది! ప్రస్తుతం కోర్టు మెళ్తెక్కడానికి సిద్దంగా ఉన్న ఈ వ్యవహారం ఏమవుతుందో తెలియాలంటే వేచి చూడాలి! ఎందుకైన మంచిది... ఇకపై ఇవిటేషన్స్‌ వస్తే.. సంబందిత ఫంక్షన్‌ కి వెళ్లేది, లెనిది ముందుగానే ఫోన్‌ చేసి చెబితే మంచిదేమో!

Tags:    

Similar News