తాజా సంచలనం.. గ్రహాంతరవాసుల్ని గుర్తించారా?

Update: 2021-10-13 03:42 GMT
ఏళ్లకు ఏళ్లుగా మనిషి మెదడును తొలిచేస్తున్నది.. ఈ అనంత విశ్వంలో మనిషి ఒంటరివాడా? మరెవరైనా ఉన్నారా? అన్న దాని మీద జరుగుతున్న డిబేట్ అంతా ఇంతా కాదు. మనమే కాదు.. గ్రహాంతరవాసులు ఉండి ఉంటారని.. వారు మనకంటే ఎన్నో వేల రెట్లు మేధస్సుతో పాటు.. అపరిమితమైన శక్తి సామర్థ్యాలు వారి సొంతమని.. వారి టెక్నాలజీ ముందు మనం ఎంతమాత్రం పనికిరామన్న విశ్లేషణలు కొన్ని వినిపిస్తూ ఉంటాయి. అయితే.. వీటిల్లో నిజం ఎంత? అన్న విషయానికి సంబంధించి మాత్రం ఇప్పటివరకు శాస్త్రీయంగా నిరూపణ కాలేదు. ఇలాంటివేళ.. ఖగోళ శాస్త్ర పరిశోధనల్లో కీలక ఘట్టం ఒకటి చోటు చేసుకున్నట్లుగా చెబుతున్నారు.

ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన రేడియో యాంటెన్నా నెదర్లాండ్స్ లో ఉంది. దాని పేరు లోఫర్ (ద డచ్ లో-ఫ్రీక్వెన్సీ అరే)గా దీన్ని అభివర్ణిస్తారు. ఈ యాంటెన్నా తాజాగా సౌర కుటుంబం వెలుపల సదూర నక్షత్రాలు వెదజల్లుతున్న రేడియో సంకేతాల్ని తాజాగా శాస్త్రవేత్తలు పసిగట్టినట్లుగా చెబుతున్నారు. దీని ప్రకారం చూస్తే.. ఆ సంకేతాల చుట్టూ గ్రహాలు దాగి ఉండొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

తాజాగా 19 అరుణ మరుగుజ్జు నక్షత్రాల్ని గుర్తించారని.. అందులో నుంచి వస్తున్న సిగ్నళ్లను అందిపుచ్చుకున్నట్లుగా చెబుతున్నారు. వాటిలో నాలుగు నక్షత్రాల చుట్టూ గ్రహాలు ఉండొచన్న వాదన వినిపిస్తోంది. సౌర కుటుంబంలోని గ్రహాలు శక్తివంతమైన రేడియో తరంగాలను వెదజల్లటం.. సౌర వాయువులు అయస్కాంత క్షేత్రాలతో చర్యలు జరిపినప్పుడు ఇలాంటి సంకేతాలు ఉద్భవిస్తుంటాయని చెబుతున్నారు. ఇప్పటివరకు సౌర కుటుంబం బయట ఉన్న గ్రహాల నుంచి సంకేతాల్ని ఇప్పటివరకు గుర్తించలేదు.తాజాగా గుర్తించిన సిగ్నళ్లు కొత్త మలుపునకు కారణం అయ్యే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది.
Tags:    

Similar News