తలాక్ తో విడాకులు.. కామంతో అత్యాచారం

Update: 2019-09-26 09:34 GMT
మూడు సార్లు తలాక్ చెప్పి తన భార్యకు ఏడాదిన్నర క్రితమే విడాకులు ఇచ్చేశాడు అలీగఢ్ యూనివర్సిటీలో పనిచేసే ఓ ప్రొఫెసర్. భార్య ఈ తలాక్ విడాకులకు ఒప్పుకోలేదు. నెత్తినోరు బాదుకుంది.. విడాకులు వద్దంది.. పంచాయతీ పెట్టింది. అయినా ఆ ప్రొఫెసర్ భార్య మాట వినకుండా మొండిగా ప్రవర్తించాడు..

దీంతో చేసేందేం లేక ఆ ముస్లిం మహిళ తన ఇద్దరు పిల్లలను తీసుకొని వేరుగా ఉంటోంది. ఒంటరిగానే ఉద్యోగం చేస్తూ జీవిస్తోంది. అయితే తన ఇద్దరు పిల్లలను చూసేందుకు అప్పుడప్పుడూ ప్రొఫెసర్ వస్తుంటాడు..

ఈ క్రమంలోనే ఇటీవల పిల్లలను చూడడానికి మాజీ భార్య వద్దకు వచ్చాడు. ఆ సమయానికి పిల్లలు ఇంట్లో లేకపోవడం.. భార్య ఒక్కతే ఉండడంతో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఈ పరిణామంతో షాకైన మాజీ భార్య పోలీసులకు మాజీ భర్త రేప్ చేశాడని ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని ఆ ప్రొఫెసర్ ను అరెస్ట్ చేశారు.
Tags:    

Similar News