ఆ ఎమ్మెల్యే ఒక డ్రగ్ ఎడిక్ట్ అట!

Update: 2015-08-11 04:26 GMT
మాదకద్రవ్యాలు నిరోదించాలంటూ ఆదివారం ఉదయం ఆప్ ఎమ్మెల్యే అల్కా లంబాపై గుర్తుతెలియని దుండదుగులు దాడిచేసిన సంగతి తెలిసిందే! ఆ రాళ్ల వర్షంలో ఎమ్మెల్యే తలకు తీవ్రంగా గాయాలయ్యాయి! ఆ సందర్భంలో ఆప్ కార్యకర్తలంతా ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం ఆమె ట్విట్టర్ లో ... "మత్తులో ఉన్న వారిని జాగృతి చేసే వరకూ నా పోరాటం ఆగదు, డ్రగ్స్ కు వ్యతిరేకంగా పోరాడుతున్నాననే నాపై దాడిచేశారు, నా రక్తం కళ్లచూసినా కూడా నా పోరాటం ఆగదు" అని స్పందించారు!

ఇది ఇలా ఉంటే... దాడిలో బాదితురాలైన లంబాపై బీజేపీ ఎమ్మెల్యే రివర్స్ ఎటాక్ మొదలుపెట్టారు. వాస్తవానికి ఎమ్మెల్యే లంబానే పెద్ద డ్రగ్స్ ఎడిక్ట్ అని అంటూనే... డ్రగ్స్ కు వ్యతిరేకంగా పోరాటం చేయడం వల్లే ఆమెపై దాడి జరిగిందని కాస్త కంఫ్యూజన్ స్టేట్ మెంట్ ఇచ్చారు! ఆమె డ్రగ్ ఎడిక్ట్ అయ్యి, ఆమెనే డ్రగ్స్ కు వ్యతిరేకంగా పోరాడితే.. దాడి జరగడం ఏమిటో శర్మ గారే చెప్పాలి. ఇదే క్రమంలో... ఎమ్మెల్యేపై దాడి అనంతరం కేజ్రీవాల్ అనుచరులైన కొందరు రౌడీలు, గూండాలు ఆ ప్రాంతంలోని దుకాణాలపై దాడులు చేశారని... ఇలాంటివి జరిగితే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ విషయంపై మరింత మాట్లాడిన శర్మ... డ్రగ్స్ లభిస్తున్నాయి అన్న ప్రాంతంలో ఆమె తెల్లవారుజామున 1 - 4 గంటల సమయంలో తిరుగుతున్నారని, కేవలం డ్రగ్స్ కు ఎడిక్ట్ అయినవాళ్లే ఆ సమయంలో తిరుగుతారని శర్మ సెలవిచ్చారు.

తోటి మహిళా ఎమ్మెల్యేపై జరిగిన దాడిని ఏమాత్రం ఖండించే ఆలోచన చేయని శర్మ... తనకు మహిళలంటే గౌరవమే అని కానీ... పూలన్ దేవిని మహిళాశక్తిగా చూపించాలంటే మాత్రం తనవల్ల అయ్యే పనికాదని, అది ఏమాత్రం కుదరదని చెప్పారు. దాడి జరిగింది ఆమెపైనే అయితే... డ్రగ్స్ మత్తులో ఆమే హింసాత్మకంగా ప్రవర్తించారు అని శర్మ చెప్పడం కొసమెరుపు!

Tags:    

Similar News