రేపే కీలక పర్వం .. ఈసీ సర్వం సిద్ధం : తమిళనాడు, కేరళ, పుదుచ్చేరికి ఒకే దశ లో
తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాలతోపాటు కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి అసెంబ్లీకి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి లో ఒకే దశలో ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఇక పశ్చిమ బెంగాల్ , అస్సాం లో మూడో దశ పోలింగ్ కి ఏర్పాట్లు పూర్తిచేశారు. తమిళనాడులో 234 స్థానాలు, కేరళలో 140 స్థానాలు, పుదుచ్చేరిలో 30 స్థానాలకు , పశ్చిమ బెంగాల్ లోని 31 సీట్లకు, అస్సాంలోని 40 స్థానాలకు కూడా పోలింగ్ నిర్వహిస్తున్నారు. విజయమే లక్ష్యంగా అన్ని ప్రధాన పార్టీలు కూడా ప్రచారాన్ని హోరెత్తించి ఇక ఓటర్ల తీర్పు కోసం ఎదుచూస్తున్నారు.
ప్రధాన పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో 2024లో జరగనున్న పార్లమెంట్ ఎన్నికలకు సెమి ఫైనల్‌గా భావిస్తున్నాయి. దీంతో అన్ని పార్టీ అగ్రశ్రేణి నాయకులు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కేరళలో ఈసారి ఎలాగైనా పాగా వేయాలని భారతీయ జనతా పార్టీ ఉవ్విళ్లూరుతోంది. దీంతో వామపక్షాల నేతృత్వంలోని ఎల్డీఎఫ్, ప్రతిపక్ష కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్‌తో బీజేపీ పోటీ పడుతుండటంతో ముక్కోణపు పోరు నెలకొంది. ఎన్నికలకు ముందు బీజేపీలో చేరిన ‘మెట్రో మ్యాన్’ శ్రీధరన్.. ఆ పార్టీకి ఏ మేరకు లాభాన్ని తెచ్చిపెడుతుందో చూడాలి. ఇక తమిళనాడులో మాజీ ముఖ్యమంత్రులు జయలలిత, కరుణానిధి లేకుండా తొలిసారిగా ఎన్నికలు జరుగుతుండటంతో అందరి దృష్టి తమిళనాడు రాజకీయాలపై పడింది. గత సంప్రదాయానికి భిన్నంగా రెండుసార్లు వరుసగా అధికారంలోకి వచ్చిన అన్నాడీఎంకే మరోసారి ఆధిపత్యాన్ని కొనసాగించాలని ప్రయత్నిస్తోంది. అయితే తమిళనాడు సర్వే లన్ని కూడా డీఎంకే అధికారం అని చెప్తున్నాయి. టీటీవీ దినకరణ్ ఏఎంఎంకే, కమల్‌హాసన్ ఎంఎన్‌ఎం పార్టీల ప్రభావం అంతంత మాత్రమే అంటున్నారు విశ్లేషకులు. ఇక, తమిళనాడులో ఎన్నికలు జరుగుతున్న 234 స్థానాల్లో దాదాపు 15 స్థానాల నుంచి తెలుగు వ్యక్తులు బరిలో నిలిచారు. అన్నాడీఎంకే నుంచి 10 మంది, డీఎంకే నుంచి ఐదుగురు పోటీ చేస్తున్నారు. ముఖ్యంగా కొలతూరు నుంచి బరిలో ఉన్న డీఎంకే అధ్యక్షుడు, ఎంకే స్టాలిన్ పై తెలుగు వ్యక్తి, అన్నాడీఎంకే నేత ఆది రాజారామ్ పోటీ చేస్తున్నారు.
ఇక, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి రాజకీయం రసవత్తంగా మారింది. బలపరీక్షలో విఫలమైన నారాయణస్వామి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ కుప్పకూలడంతో పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలన విధించారు. డీఎంకేతో కలిసి మళ్లీ అధికారం చేజిక్కించుకునేందుకు నారాయణ స్వామి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు, అధికారంలోకి వచ్చేందుకు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ముమ్మరంగా ప్రచారాన్ని నిర్వహించింది. అధికారాన్ని చేపట్టడమే లక్ష్యంగా బీజేపీ ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. పుదుచ్చేరిలో ఆదివారం సాయంత్రం నుంచే 144 సెక్షన్ విధించారు. మద్యం దుకాణాలు, బార్లను శనివారం రాత్రి నుంచే మూసివేశారు. ఎన్నికల పోలింగ్ ముగిసేవరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని ఎన్నికల కమిషన్ తెలిపింది.
మరోవైపు, బెంగాల్ ఎన్నికలు బీజేపీకి, తృతమూల్‌కు అగ్ని పరీక్షగా మారాయి. మూడోసారి అధికారంలోకి వచ్చి తన సత్తా ఏంటో నిరూపించుకోవాలని మమత బెనర్జీ ప్రయత్నిస్తుండగా.. ఎలాగైనా బెంగాల్‌లో పాగా వేయాలని కమలం నేతలు సర్వశక్తులు వడ్డుతున్నారు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ నెల 27 నుంచి ప్రారంభమై ఎనిమిది విడతల్లో జరగనున్న ఈ ఎన్నికల్లో.. కాంగ్రెస్, వామపక్షాలు, ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ కలిసి పోటీచేయడంతో రాజకీయాలు మరింత వేడెక్కాయి. బెంగాల్‌లో 8 దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే మూడు విడతల్లో పూర్తి కాగా, ఇంకా ఐదు విడతల ఎన్నికలు జరగాల్సి ఉంది. మంగళవారం జరగనున్న మూడోదశలో ఎన్నికలు జరుగనున్న బెంగాల్‌లో అధికార తృణమూల్ కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ మధ్య హోరాహోరీ సాగుతోంది.ఈశాన్య రాష్ట్రాల్లో అతిపెద్దదైన అసోం ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ కాంగ్రెస్ ప్రచారంలో హోరెత్తించాయి. మొత్తంగా మూడు దశల్లో ఇక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే రెండు దశల్లో పోలింగ్ పూర్తి కాగా, చివరి విడత మంగళవారం జరగనుంది. వీటి ఫలితాలు మే 2న ప్రకటిస్తారు. మొత్తంగా 126 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇక్కడ ఎన్నికలు నిర్వహిస్తున్నారు.