వైసీపీ అక్కడ రీ సౌండ్ చేస్తే... ?

Update: 2021-10-19 08:30 GMT
వైసీపీకి ఎదురులేదు అని గత రెండున్నరేళ్లలో జరిగిన అన్ని ఎన్నికలూ నిరూపించాయి. వైసీపీకి ఎన్నికలు అంటే సరదా అయితే విపక్షాలు మాత్రం వ్యధగా మారుతున్న పరిస్థితి నెలకొంది. ఇవన్నీ పక్కన పెడితే తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో అయిదు లక్షల మెజారిటీ రావాలని జగన్ క్యాడర్ ని ఆదేశించారు. మొత్తానికి మూడు లక్షలకు పైగా మెజారిటీ దక్కింది. పోలింగ్ కి ఓటర్లు పెద్ద ఎత్తున రాకపోవడం వల్లనే మెజారిటీ తగ్గింది. అయినా వైసీపీ 2019 ఎన్నికల్లో సాధించిన మెజారిటీ కంటే కూడా ఉప ఎన్నికల్లో బాగా పెరిగింది. ఇక ఇపుడు అందరి చూపూ బద్వేల్ ఉప ఎన్నిక మీద ఉంది.

బద్వేల్ లో వైసీపీకి 2019 ఎన్నికలో 44 వేల మెజారిటీ వచ్చింది. జగన్ వేవ్ బలంగా వున్న టైమ్ లో కూడా టీడీపీ యాభై వేల ఓట్లను సాధించడం విశేషం. ఈసారి టీడీపీ పోటీలో లేదు, పేరుకు మాత్రమే పోటీ అన్నట్లుగా బీజేపీ, కాంగ్రెస్ తీరు ఉంది. దాంతో అక్కడ విజయం కాదు భారీ మెజారిటీ మీద దృష్టి పెట్టండి అంటూ వైసీపీ అగ్ర నాయకత్వం నుంచి ఆదేశాలు వెళ్లాయి. లక్షణంగా లక్ష మెజారిటీ తీసుకురావాల్సిందే. అక్కడ వైసీపీ చేసే రీ సౌండ్ కి విపక్ష శిబిరం దద్దరిల్లాల్సిందే అంటూ దిశా నిర్దేశం చేస్తున్నారని టాక్.

బద్వేల్ లో దాదాపుగా రెండున్నర లక్షల మంది ఓటర్లు ఉన్నారు. అందులో గత ఎన్నికల్లో లక్షన్నర మంది ఓట్లు వేశారు. వైసెపీకి 94 వేల ఓట్లు వచ్చాయి. ఇక ఇపుడు లక్షన్నర ఓట్ల దాక పోలింగ్ జరిగే అవకాశం అయితే లేదు అంటున్నారు. దాంతో లక్ష మెజారిటీ ఎలా సొంతం అన్న ప్రశ్న వస్తోంది. అయితే బీజేపీ కాంగ్రెస్ లను నోటాతో పోటీకి పెడుతున్న అధికార పార్టీ పడే ప్రతీ ఓటూ వైసీపీకే చెందేలా చూడాలని ఆదేశించినట్లుగా తెలుసొతంది. అంటే ఈసారి లక్షకు పైగా ఓట్లు పడినా కూడా మొత్తానికి మొత్తం వైసీపీ ఖాతాలోనే పడితే కచ్చితంగా లక్ష మెజారిటీ ఖాయమే అంటున్నారు. మరి జగన్ సొంత ఇలాకా కడప జిల్లాలో ఎన్నిక అంటే అది ప్రెస్టేజ్ తో కూడుకున్న వ్యవహారమే. దాంతో జగన్ కోరుకున్నట్లుగా లక్ష మెజారిటీ కోసం క్యాడర్ ఇప్పటి నుంచే భారీ కసరత్తు చేస్తోంది. బద్వేల్ రిజల్ట్ తో తమకు ఎవరూ పోటీ కానీ సాటి కానీ లేరని చెప్పాలన్నదే వైసీపీ పెద్దల ఆలోచనగా ఉంది.




Tags:    

Similar News