ఏపీ సీఎం జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గత ఏడాదిగా ఎదురుపడింది లేదు. ఎందుకంటే గత వర్షాకాల సమావేశాల్లోనే చంద్రబాబు ఒక భీషణ ప్రతిజ్ఞ చేసి అసెంబ్లీ నుంచి బయటకు వెళ్లిపోయారు. ఇది గౌరవ సభ కాదు, కౌరవ సభ. తాను తిరిగి ముఖ్యమంత్రిగానే సభలో అడుగుపెడతాను అని శపధం చేశారు. ఆ విధంగానే ఆయన సభకు రాకుండా దూరంగా ఉంటున్నారు.
ఇప్పటికి శీతాకాలా సమావేశాలతో పాటు బడ్జెట్ సెషన్, వర్షాకాల సమావేశాలు జరిగాయి. కానీ బాబు మాత్రం గైర్ హాజరవుతూనే ఉన్నారు. దాంతో ఈ ఇద్దరు నేతలు ఎదురుపడిన సందర్భం అయితే ఏడాదిగా లేదు అనే చెప్పాలి. కానీ ఇపుడు ఒక కీలకమైన సమావేశానికి ఇద్దరు నేతలూ హాజరవుతున్నారు అని అంటున్నారు.
ఢిల్లీలో డిసెంబర్ 5న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన అఖిల పక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి దేశంలోని అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానించారు. అలా ఏపీ నుంచి వైసీపీ, టీడీపీలకు ఆహ్వానలు అందాయి. ఈ సమావెశం ముఖ్యమైనది. జీ 20 సదస్సుకు అధ్యక్షత వహించే అవకాశం భారత్ కి వచ్చింది. వచ్చే ఏడాది దేశంలో జీ 20 సదస్సుని నిర్వహించనున్నారు.
ఆ సమావేశం నేపధ్యంలో దేశంలోని విపక్షాల సలహాలూ సూచనలూ తీసుకోవడానికి కేంద్రం ఈ మీటింగ్ ని ఏర్పాటు చేసింది. కేంద్ర పార్లమెంటరీశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ అందరికీ స్వయంగా ఆహ్వానిస్తున్నారు. అయితే ఏపీ నుంచి బాబుకు మాత్రమే ఆహ్వానం అందినట్లుగా అది కూడా మోడీయే పిలిపించుకున్నారు అన్నట్లుగా టీడీపీ అనుకూల మీడియా కలరింగ్ ఇస్తోంది. నిజానికి పార్లమెంట్ లో నాలుగవ అతి పెద్ద పార్టీగా ఉన్న వైసీపీకి కూడా ముందే ఆహ్వానం అందింది.
ఇక గతంలో అంటే కొద్ది నెలల ముందు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమం ముగింపు సందర్భంగా కూడా ప్రధాని అఖిల పక్ష భేటీ నిర్వహించారు. ఆనాడు జగన్ కి బాబుకీ ఇద్దరికీ ఆహ్వానం లభించింది. కానీ జగన్ కావాలనే వెళ్లలేదు. అయితే ఇపుడు మాత్రం ఆయన హాజరవుతారు అని అంటున్నారు. ఎందుకంటే జీ 20 అధ్యక్ష స్థానం భారత్ కి దక్కడమే కాదు దీంతో పాటు ఈ ఏడాది కాలంలో వివిధ ప్రాంతాల్లో 32 రంగాలపై కేంద్రం 200కి పైగా సమావేశాలు నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది.
అలా ఏపీలో కూడా జి 20 సదస్సు మీద సన్నాహక కార్యక్రమాలు నిర్వహించాలీ అంటే ముఖ్యమంత్రి హోదాలో జగన్ తన నిర్ణయాలను ప్రధానికి తెలియచేయాలి. అలాగే సలహా సూచనలు ఇవ్వాలి. అందుకోసం జగన్ కచ్చితంగా హాజరవుతారు అని అంటున్నారు. అదే జరిగితే దాదాపుగా ఏడాది కాలం తరువాత బాబు జగన్ ఇద్దరూ ఎదురు పడనున్నారు. అది కూడా ప్రధాని మోడీ సమక్షంలోనే ఈ ఇద్దరు నేతలూ ముఖాముఖాలు చూసుకోనున్నారు.
నిజానికి ఏపీలో రాజకీయ పరిస్థితులు పూర్తిగా బీజేపీకి తెలుసు. విశాఖకు ఈ మధ్య వచ్చినపుడు పవన్ కళ్యాణ్ణి పిలిపించుకుని ప్రధాని ఆయనతో అరగంటకు పైగా భేటీ వేశారు. ఇపుడు ఆయన బాబుతో కూడా సమావేశం అవుతారు అని అంటున్నారు.
కానీ అది నిజం కాదు, కేవలం అఖిలపక్షం మీటింగ్ మాత్రమే జరుగుతుంది. అయితే మోడీతో అపాయింట్మెంట్ చంద్రబాబు కోరవచ్చు. ఇక ఢిల్లీ దాకా వెళ్ళిన జగన్ ప్రధానిని నేరుగా కలవకుండా వచ్చే చాన్స్ లేదనే అంటున్నారు. మొత్తానికి ఏపీ రాజకీయం ప్రధాని సుముఖంలో కొత్త రూపు సంతరించుకుంటుందా అన్న చర్చ అయితే సాగుతోంది.