కరోనా వైరస్ కారణంగా ఏ మాత్రం ముందస్తు చర్యలు తీసుకోకుండా మహమ్మారిని అరికట్టడం కోసం లాక్ డౌన్ ను అమల్లోకి తీసుకురావడంతో దేశ వ్యాప్తంగా అనేకమంది వలస కార్మికులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉన్న చోట పనిలేక ..తినడానికి తిండి లేక , సరైన రవాణా సౌకర్యం కూడా లేకున్నా నడకదారి పట్టి ఎంతోమంది సొంత ఊర్లకి ప్రయాణమైయ్యారు. ఇలా వలస కార్మికులు వెళ్లే సమయంలో ఎంతోమంది మృత్యువాత పడ్డారు. మరికొంతమంది అనేక ఇబ్బందులకు గురైయ్యారు. ఆ సమయంలో వలస కార్మికుల కష్టాలపై మీడియా లో వచ్చిన కథనాలను సుప్రీంకోర్టు సుమోటాగా స్వీకరించిన విషయం తెలిసిందే.
తాజాగా, ఈ కేసుపై గురువారం విచారణ చేప్పట్టిన సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సొంతూళ్లకు వెళ్లాలనుకునే వారిని గుర్తించడం రాష్ట్రాల బాధ్యతేని స్పష్టం చేసింది. జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ ఎంఆర్ షాల ధర్మాసనం ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేసింది. వలస కూలీల సమస్యల పరిష్కారానికి జాతీయ విధానం రూపొందించాలని సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ న్యాయస్థానాన్ని కోరారు. కరోనా వైరస్ నిర్వహణలో భాగంగా ఇప్పటికే అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్నామని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు.
అయితే, మహరాష్ట్ర ప్రభుత్వ అఫిడవిట్ పై అసంతృప్తి వ్యక్తం చేసిన సుప్రీం, వలస కూలీల అంశంపై వారం రోజుల్లో సమగ్రంగా నివేదిక అందజేయాలని ఆదేశాలు జారీచేసింది. అలాగే మహారాష్ట్ర తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కు సరైన సలహాలు ఇవ్వాలని సూచించారు. ఆ తరువాత కేసు విచారణను జులై 17కి వాయిదా వేసింది. మీ అఫిడవిట్ సక్రమంగా లేదు.. అఫిడవిట్ దాఖలు చేయమంటే మీ తరపున స్టేట్‌మెంట్ ఇవ్వడం కోసం కాదు. మహారాష్ట్రలో వలస కార్మికుల సమస్య లేదన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనతో మేము ఏకీభవించలేం. సరైన వివరాలతో దాఖలు చేయమని మీరు రాష్ట్రానికి సలహా ఇవ్వాలి’ అని జస్టిస్ అశోక్ భూషణ్ వ్యాఖ్యానించారు.