ఆళ్ల సింప్లిసిటీకి మరో నిదర్శనం..

Update: 2019-06-03 05:38 GMT
నాయకుడంటే ఎలా ఉండాలి.. జనంలో ఉండాలి.. జనంతో మమేకమవ్వాలి. సాధారణ జీవితం గడపాలి.. కొండంత ఘనత సాధించినా.. ఏమాత్రం గర్వం లేని వాడిలా వ్యవహరించాలి. అలాంటి లక్షణాలన్నీ పుణికిపుచ్చుకున్నాడు ఆళ్ల రామకృష్ణ రెడ్డి. మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే అయిన ఈయన సాధించిన ఘనతలు అన్నీ ఇన్నీ కావు..

మంగళగిరి.. మొన్నటి ఎన్నికల వేళ టీడీపీ అధినేత చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ పోటీ చేసిన నియోజకవర్గం. ఇక్కడ చినబాబును గెలిపించడానికి అధికారంలో ఉన్న టీడీపీ చేయని పని లేదు.. 150 కోట్ల వరకు ఖర్చు పెట్టి.. అధికారులు - పోలీస్ వ్యవస్థను చెరబెట్టి వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డిని ఓడించడానికి శతవిధాలా ప్రయత్నించారని ఆరోపణలు వచ్చాయి. కానీ వైసీపీ గాలి - జగన్ వేవ్.. ఆళ్ల రామకృష్ణ రెడ్డి నియోజకవర్గ ప్రజలతో కలిసి చేసిన పోరాటం ఆయనను అందలమెక్కించింది.

ఆళ్ల రామకృష్ణ రెడ్డి రాజధాని అమరావతి కోసం టీడీపీ భూములు లాక్కుంటే రైతుల పక్షాన పోరాడారు. హైకెర్టు కెక్కి టీడీపీ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేశారు. కేసులతో చంద్రబాబును ఇరుకునపెట్టారు. ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి అయినా ఇప్పటికీ ఆయన తన పొలంలో దుక్కిదున్ని- కూరగాయలు పండిస్తూ.. వ్యవసాయం చేస్తున్న పిక్స్ ఇటీవల వైరల్ గా మారాయి. ఎంతో సాధించినా ఇంకా రైతు వలే పొలంలో పనిచేస్తూ సాధారణ జీవితం గడిపే ఆళ్ల రామకృష్ణ రెడ్డి పిక్స్ ఇటీవల వైరల్ గా మారాయి.

ఇక తాజాగా బేగంపేట నుంచి గుంటూరుకు పల్నాడ్ ఎక్స్ ప్రెస్ లో ఆళ్ల రామకృష్ణారెడ్డి సాధారణ బోగీలోనే వచ్చేశారు. రైళ్లో 50మంది యువకులు ఆళ్లను గుర్తుపట్టి ఫొటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో విషయం వెలుగుచూసింది. ఆ 50మంది జగన్ గెలిచాడని తిరుపతిలో మొక్కులు మొక్కుకొని వస్తున్నారట.. ఇలా జగన్ సీఎం కావాలని ప్రజలందరూ కోరుకున్నారని అందుకే జగన్ గెలిచారని ఆర్కే వారితో చెప్పారట.. ఇలా ఆళ్ల సింప్లిసిటీ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మరి జగన్ హామీనిచ్చినట్టు ఈయనకు మంత్రి పదవి వస్తుందో లేదో చూడాలి.
Tags:    

Similar News