కరణం ఎన్నిక చెల్లదు..కోర్టెకెక్కిన ఆమాంచి

Update: 2019-07-07 06:54 GMT
చీరాల టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాంకు గడ్డు పరిస్థితి ఎదురయ్యేలా కనిపిస్తోంది. ఆయన ఎన్నిక చెల్లదంటూ ఆయన చేతిలో ఓడిపోయిన చీరాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆమాంచి కృష్ణమోహన్ హైకోర్టుకెక్కారు. కరణం బలరాం ఎన్నికను రద్దు చేయాలని పిటీషన్ దాఖలు చేశారు. ఎన్నికల్లో కరణం తప్పుడు సమాచారాన్ని అఫిడవిట్ లో పేర్కొన్నాడని ఆధారాలను ఆమాంచి కోర్టుకు సమర్పించారు.

టీడీపీ తరుఫున చీరాలలో ఎమ్మెల్యేగా పోటీచేసిన కరణం బలరాం ఈ ఎన్నికల్లో సమర్పించిన అఫిడవిట్ లో తనకు ముగ్గురు మాత్రమే సంతానం అని చూపించారు. అయితే వాస్తవానికి కరణం బలరాంకు నలుగురు సంతామని ఆమాంచి కృష్ణమోహన్ కోర్టుకు ఆధారాలు చూపించారు. కరణం బలరాం తప్పుడు అఫిడవిట్ ప్రకారం.. ఆయనపై అనర్హత వేటు వేయాలని.. తనకు ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వాలని కోరారు.

2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుంచి టీడీపీ నుంచి కరణం పోటీచేశారు. వైసీపీ నుంచి ఆమాంచి కృష్ణమోహన్ పోటీచేశారు. ఈ ఎన్నికల్లో కరణం వైసీపీ అభ్యర్తి ఆమాంచిని స్వల్ప తేడాతో ఓడించారు.

అయితే ఎన్నికల్లో తప్పుడు అఫిడవిట్ సమర్పించాడని ఆరోపిస్తూ ఇప్పుడు ఆమాంచి ఆయన ఎన్నికల చెల్లదంటూ కోర్టుకెక్కారు. దీంతో కరణం ఎన్నిక రద్దు అయ్యే అవకాశాలుంటాయని న్యాయనిపుణులు సూచిస్తున్నారు.


Tags:    

Similar News