జగన్ సర్కారులో అమ‌రావ‌తి అనగా డైలమా!

Update: 2022-08-22 14:30 GMT
3 రాజ‌ధానుల‌పై ఎటువంటి నిర్ణ‌య‌మూ చెప్ప‌ని జ‌గ‌న్ ఇక‌పై కూడా ఇలానే డైల‌మా కొన‌సాగిస్తారా ? అన్న అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి కొన్ని వ‌ర్గాల నుంచి ముఖ్యంగా రాజ‌ధాని రైతాంగం ఇది ఫిక్సయ్యారు.  ఎందుకంటే ఇప్ప‌టికే దాదాపు వెయ్యి రోజులుగా పోరాటాలు చేస్తున్న మ‌హిళ‌లు, ఇత‌ర వ‌ర్గాలు కూడా ఇంకా కొంత కాలం అనిశ్చితిని కొన‌సాగిస్తే తామేం కావాలి అని ప్ర‌శ్నిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో వాళ్లంతా మ‌రో  ఉద్య‌మానికి అమ‌రావ‌తి నుంచి అర‌స‌వ‌ల్లికి పేరిట ఓ పాద‌యాత్ర‌కు సిద్ధం అవుతున్నారు.  జ‌గ‌న్ మాత్రం ఏ విధమైన  స్ప‌ష్ట‌తా ఇవ్వ‌డం లేదు. మూడు రాజధానులు ముందుకు పడదు. అమరావతి డైలమా ఆగదు.

ముఖ్యంగా వైసీపీ వాద‌న ఏంటంటే అమ‌రావ‌తి అభివృద్ధికి ల‌క్ష కోట్లు అవుతుంద‌ని, త‌మ ప్ర‌భుత్వం అంత‌టి ఆర్థిక భారాన్ని భ‌రించ‌లేద‌ని తేల్చి చెబుతోంది. ఇదే మాట ఆర్థిక శాఖ మంత్రి బుగ్గ‌న రాజేంద్ర, సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చెప్పారు. తేల్చేశారు కూడా ! అంటే రాజ‌ధాని నిర్మాణానికి కేంద్రం నుంచి ఆ రోజు తెచ్చుకున్న నిధుల లెక్కేంటి.. వాటి వినియోగం మాటేంటి అని బీజేపీ అంటోంది. అయ్యా అమరావతి డబ్బులు అమరావతే సంపాదిస్తుందని టీడీపీ అంటోంది.

అయితే, ఇందులో రాజకీయ విశ్లేషకులు మాత్రం వేరే కోణాన్ని చూస్తున్నారు. క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన ఆర్థిక మూలాల‌ను దెబ్బ కొట్టేందుకు చేస్తున్న ప్ర‌య‌త్నంలో భాగంగానే అమ‌రావ‌తి నిర్మాణంపై ఎటువంటి చ‌ర్య‌లూ తీసుకోవ‌డం లేదు. ఏ అడుగూ ముందుకు వేయ‌డం లేదు. కేవ‌లం రాజ‌కీయ ప్ర‌చ్ఛ‌న్న యుద్ధంలోభాగంగానే ఇప్పుడిక్క‌డ ప‌నులు ఆగిపోయాయి.

అందుకే అమ‌రావ‌తిని ఓ క్యాపిట‌ల్ వెంచ‌ర్ గా కాకుండా ఓ మాములు ప‌ట్ట‌ణం క‌న్నా దిగువ స్థాయి చేర్చుతున్నార‌న్న విమర్శలు, ఆరోపణలు వైసీపీపై వస్తున్నాయి. దానివల్ల ఎన్నిక‌ల నాటికి చంద్ర‌బాబు వ‌ర్గం ఆర్థిక మూలాలు బ‌ల‌హీన ప‌డి, జ‌గ‌న్ బ‌ల‌ప‌డేందుకు అవ‌కాశాలు ఉంటాయని జగన్ ఇలా చేస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్టులు కనిపిస్తున్నాయి. షేర్ మార్కెట్ లో కూడా అమ‌రావ‌తి బాండ్ల‌కు వేల్యూ లేకుండా పోవడం జగన్ తీసుకున్న నిర్ణయాల ఫలితమే అంటున్నారు వారు.
 
ఇక అమరావతిని కట్టమని కోర్టులు చెబితే... ఆర్థిక మూలాలు లేని కార‌ణంగా భూముల అమ్మ‌కానికి అనుమ‌తి ఇస్తే అప్పుడు కాస్త మిగిలి ఉన్న నిర్మాణాల‌ను పూర్తి చేస్తామ‌ని కోర్టుకు జ‌గ‌న్ విన్న‌వించారు. దీనికి కూడా కోర్టు స‌మ్మ‌తించ‌లేదు. రాజ‌ధాని భూములు రాజ‌ధానికే చెందాల‌ని ఇత‌ర అవ‌సరాల‌కు కానీ ఇత‌ర ప్ర‌యోజ‌నాల‌కు కానీ అమ్ముకునేందుకు వీల్లేద‌ని తేల్చేసింది.

దీంతో స‌మ‌స్య మ‌ళ్లీ మొద‌టికి వ‌చ్చింది. సీఆర్డీఏ అత్యుత్సాహానికి తెర పడింది. ఆ విధంగా అమ‌రావ‌తి ప‌నులు ఆగిపోయాయి. ఇక‌పై కొన‌సాగుతాయో లేదో కూడా  చెప్ప‌లేం.  ఆ విధంగా బ్రాండ్ ఏపీ, బ్రాండ్ అమ‌రావ‌తి అన్న‌వి కూడా  ఆగిపోయాయని రాజధాని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
Tags:    

Similar News