ఎప్పటికప్పుడు విషయాలు కొత్తగా ఉండాలి. ఒకే సమస్యపై అదే పనిగా పోరాడుతున్నా పట్టించుకోని మీడియా ఒకవైపు.. మీరేం చేసినా సరే మేం స్పందించమన్నట్లుగా సర్కారు ఉన్నప్పటికి అమరావతి రైతులు మాత్రం వెనక్కి తగ్గట్లేదు. ఏపీ రాష్ట్ర పాలనను అమరావతి నుంచే చేపట్టాలన్న డిమాండ్ తో అక్కడి రైతులు గడిచిన 158 రోజులుగా గాంధేయ మార్గంలో పోరాటం చేస్తున్నారు. రాజధాని కోసం విలువైన భూముల్ని ఇచ్చిన తమకు సర్కారు ఇచ్చే బహుమానం ఇదేనా? అని ప్రశ్నిస్తున్నారు.
ఏపీ రాష్ట్ర భవిష్యత్తు కోసం బంగారం లాంటి లంక భూముల్ని ప్రభుత్వానికి ఇస్తే.. ఇప్పుడు రాజధానిని వేరే చోటుకు తరలించే వైనాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అమరావతి నుంచే పాలన సాగించాలని కోరుతూ గడిచిన ఐదు నెలలుగా పోరాడుతున్నారు అమరావతి రైతులు. తొలుత వారు చేసే పోరాటానికి మీడియాలో చోటు దక్కినా.. తర్వాతి కాలంలో వారి డిమాండ్ ను పట్టించుకోవటం మానేశారు. దీనికి తోడు ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక పరిస్థితులు తలెత్తటంతో సీన్ మొత్తం మారిపోయింది.
ఊపిరి ఉన్నంతవరకూ గాంధేయ మార్గంలో పోరాడుతూనే ఉంటామని చెబుతున్న రైతుల ఆవేదన ఇలా ఉంటే.. అమరావతి రైతులపై సోషల్ మీడియాలో కొందరు చేస్తున్న ప్రచారం అన్నదాతల్ని ఆవేదనకు గురి చేస్తోంది. రాష్ట్ర భవిష్యత్తు కోసం తాము భూములు ఇస్తే.. స్థానిక పరిస్థితుల గురించి తెలీకుండా సోషల్ మీడియాలో కొందరు నానా మాటలు మాట్లాడటాన్ని రైతులు తప్పు పడుతున్నారు. రాష్ట్ర రాజధానిగా అమరావతినే సాగించాలన్న డిమాండ్ తో అక్కడి రైతులు చేస్తున్న పోరాటం రోజులు గడుస్తున్నా.. వారు మాత్రం వెనక్కి తగ్గట్లేదు. మీడియాతో సహా అందరూ మర్చిపోతున్నా.. మడమ తిప్పని రీతిలో అమరావతి రైతులు చేస్తున్న పోరు ఎప్పటివరకూ సాగుతుందన్నది ప్రశ్నగా మారిందని చెప్పక తప్పదు.