రాజధాని అమరావతి కోసం జరిపిన భూసేకరణ వేళ.. దళిత రైతుల్ని మోసం చేశారంటూ వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామక్రిష్ణారెడ్డి సీఐడీకి కంప్లైంట్ చేయటం.. వారు కేసు నమోదుచేసిన విపక్ష నేత చంద్రబాబుకు నోటీసులు ఇవ్వటం.. ఈ నెల 23న జరిగే విచారణకు హాజరు కావాలని చెప్పటం తెలిసిందే. అయితే.. ఈ నోటీసులపై స్టే కోరిన చంద్రబాబుకు ఊరట కలిగిస్తూ హైకోర్టు స్టే ఇచ్చింది. ఇదంతా పాత విషయమే కదా? అంటారా? కొత్త విషయం మరింత బాగా అర్థం కావాలంటే పాత విషయాన్నికాస్త గుర్తు చేసుకుంటే మంచిది.
ఇంతకీ విషయం ఏమంటే.. దళిత రైతుల్ని మోసం చేశారంటూ ఆళ్ల చేసిన ఫిర్యాదు వెనుక ఉన్న ఆ దళిత రైతులు ఎవరు? వారి బ్యాక్ గ్రౌండ్ ఏమిటన్న విషయంపై ఒక మీడియా సంస్థ సంచలన కథనాన్ని అచ్చేసింది. ఆళ్ల పేర్కొన్న బాధిత రైతుల బ్యాక్ గ్రౌండ్ ఇదంటూ వెల్లడించిన వివరాలు విస్మయానికి గురి చేస్తున్నాయి. ఎందుకంటే..బాధితులుగా చెబుతున్న వారికి తమకు భూమి ఉందన్న విషయం తెలీదని.. మరొకరి ఉదంతంలో అయితే రాజధాని కోసం భూమి ఇవ్వలేదని.. వారికి అసైన్డ్ బూములు కూడా లేవని తేల్చినట్లు చెప్పింది.
తన వద్దకు వచ్చి బాధలు చెప్పుకున్నారంటూ ఆళ్ల చెప్పిన మాటల్ని విని సీఐడీ కేసు నమోదు చేసిందని చెబుతున్నారు. అదే నిజమైతే.. వాస్తవాలు ఎందుకు విరుద్ధంగా ఉన్నాయన్నది మరో ప్రశ్న. ఆళ్ల చెప్పిన దాని ప్రకారం మందడం గ్రామానికి చెందిన వెంగళదాసు రాజేశ్వరరావు.. వెంగళదాసు నాగేశ్వరరావు.. పిల్లి జోజయ్యలను పిలిపించిన సీఐడీ అధికారులు తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో ప్రశ్నించారు.
మీ భూముల్ని అప్పటి ప్రభుత్వం బలవంతంగా తీసుకుందా? అని అడిగితే.. తాము స్వచ్చందంగా ఇచ్చామని.. రాజధాని ఏర్పాటు చేయటం కారణంగా తమ భూములకు ఊహించని ధర లభించిందని.. తమ బిడ్డలకు మంచి భవిష్యత్తు ఉంటుందనే ఆలోచనతోనే ఇష్టపూర్వకంగా రాజధాని నిర్మాణం కోసం ఇచ్చామన్నారు. ఆళ్ల చెప్పిన బాధితుల్లో మరొకరైన అద్దేపల్లి సాంబశిరావు వ్యవహారం మరింత భిన్నంగా ఉందని చెబుతున్నారు. అతనిది కృష్ణాయపాలెం. ఆయన తండ్రికి రెండో భార్య ఉన్నారు. ఆమెకు ఒక కొడుకు ఉన్నారు. అతడి పేరు కృపానందం. వీరి తండ్రికి కొండవీటి వాగుపోరంబోకు ఆక్రమించుకున్న ఆరోపణ ఉంది. దీని హక్కుపై వీరి మధ్య గొడవలు జరిగాయి. అదే భూమిని ఇద్దరూ తమదేనని నమ్మించి వేరే వారికి అమ్మేశారు. ఈ గొడవల నేపథ్యంలో కృపానందం ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పుడు సాంబశివరావు అధికారుల్ని కలిశారు. అప్పట్లో కొన్నవ్యక్తి నుంచి తిరిగి భూమిని ఇప్పిస్తామని నమ్మించి సంతకం చేయించుకున్నట్లు చెప్పారు. ఇలా ఆళ్ల వారు పేర్కొన్న వారి వ్యవహారం.. భిన్నంగా ఉండటం చర్చనీయాంశంగా మారినట్లుగా సదరు కథనంలో పేర్కొన్నారు. మరి.. దీనికి ఆళ్లవారు ఏమంటారో?