నిజంగానే భారతీయులందరూ వేసుకోవాల్సిన ప్రశ్న ఇది. సంప్రదాయ రాజకీయాల స్థానాన్ని దూకుడు రాజకీయాలు కమ్మేస్తున్న వేళ.. తాజాగా సరికొత్త ముప్పు ప్రజాస్వామ్యాన్ని చుట్టు ముట్టేస్తోంది. ప్రజల మద్దుతుతో ఏర్పడే ప్రభుత్వాలు.. తమకున్న ‘పవర్’తో అన్ని వ్యవస్థల్ని తమ చెప్పు చేతుల్లో తీసుకునే సరికొత్త రాజకీయ విన్యాసం ఈ మధ్యన భారతావనిలో ఎక్కువైంది.
ఈ తరహా ప్రమాదకర పోకడలు గతంలోనూ ఉన్నప్పటికీ.. నాడు వ్యవస్థల మీద జరిగే దాడుల్ని ఎదిరించే వారు.. కొన్ని సంస్థలు ఉండేవి. ప్రభుత్వాలు ఇష్టారాజ్యంగా వ్యవహరించటాన్ని.. అధినేతల అహంకారాన్ని ప్రశ్నించి.. నిజాల్ని నిర్భయంగా చెప్పే ధోరణి గతంలో ఉండేది. విషాదకరమైన విషయం ఏమిటంటే.. ఇప్పుడు ఎవరికివారు.. అధికారం ముందు సాగిలపడటం.. లేదంటే హుందాతనంతో కూడిన రాజీకి వెళ్లటంతో అంతా ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉన్నట్లుగా కనిపించే పరిస్థితి ఎక్కువైంది.
దేశంలో ఎక్కడెక్కడ ఇలాంటి పరిస్థితులు ఉన్నాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అందరికి అన్ని విషయాలు తెలుసన్నది నిజం. మన దేశంలో ఇలాంటి పరిస్థితి ఉంటే.. ప్రపంచానికి పెద్దన్న లాంటి దేశంలో మాత్రం ఇందుకు భిన్నమైన పరిస్థితి కనిపించి విస్మయానికి గురి చేస్తుందని చెప్పాలి. పవర్ లోకి వచ్చే అధినేతలు తీసుకునే నిర్ణయాలకు డూడూ బసవన్నల మాదిరి తల ఊపే ప్రసక్తే లేదంటూ.. వ్యాపార సంస్థలు తేల్చి చెప్పటం.. జాతి శ్రేయస్సులో భాగంగా.. ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా ఉండాలన్న నిర్ణయాన్ని తీసుకోవటం సర్ ప్రైజింగ్ ఉందనే చెప్పాలి.
వ్యాపార ప్రయోజనాల ముందు.. వ్యక్తిగత విలువల్ని లైట్ తీసుకునే వైఖరి మన దగ్గర చాలా ఎక్కువగా కనిపిస్తుంటుంది. కానీ.. అమెరికాలో మాత్రం అందుకు భిన్నంగా కంపెనీలు గళం విప్పటం ఆసక్తికర అంశంగా చెప్పక తప్పదు. త్వరలో అమెరికా అధికార పీఠం మీద కూర్చోనున్న ట్రంప్ తీసుకున్న వివాదాస్పద నిర్ణయాన్నిఅక్కడి బడా కంపెనీలైన మైక్రోసాఫ్ట్.. అమెజాన్.. గూగుల్ లాంటి కంపెనీ నో అంటే నో అనేయటం ఆసక్తికరమని చెప్పాలి.
అమెరికాలో ఉన్న ముస్లిం వలసదారులకు సంబంధించిన డేటాబేస్ ను తయారు చేయాలన్న ట్రంప్ నిర్ణయానికి తాము సహకరించేది లేదంటూ ఈ ఆగ్ర కంపెనీలు స్పష్టం చేస్తున్నాయి. అంతేకాదు.. ట్రంప్ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా మైక్రోసాఫ్ట్.. అమెజాన్ కంపెనీకి చెందిన ఉద్యోగులు.. సాంకేతిక నిపుణులు ఒక ఆన్ లైన్ పిటీషన్ సిద్ధం చేశారు. ఈ తరహా డేటాబేస్ తయారు చేయటం వివక్షతో కూడుకున్నదని.. ఇందుకు తాము సహకరించేది లేదంటూ తేల్చి చెబుతున్నారు. ఈ రెండు కంపెనీలకు తోడుగా గూగుల్.. యాపిల్.. ఐబీఎం.. ఇతర టెక్నాలజీ కంపెనీలు కూడా ఇదే తరహా గళాన్ని విప్పటం గమనార్హం. ఇలాంటి ధైర్యాన్ని మన కంపెనీలు ప్రదర్శించగలవా? అన్న ప్రశ్న భారతీయులు వేసుకోవాల్సి వస్తే..?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/