నితీష్ కి భారత రత్న ఇస్తారా ?

బీహార్ సీఎం జేడీయూ అధినేత నితీష్ కుమార్ సుదీర్ఘ కాలంగా బీహార్ కి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Update: 2024-12-26 03:29 GMT

బీహార్ సీఎం జేడీయూ అధినేత నితీష్ కుమార్ సుదీర్ఘ కాలంగా బీహార్ కి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన వెనుకబడిన వర్గాలకు చెందిన నాయకుడు. బీహార్ లో చూస్తే ఇప్పటికి ఎంతో మంది సీఎంలు గా ఉన్నా అత్యధిక కాలం ఈ పదవిలో ఉన్న వారిగా నితీష్ కుమార్ రికార్డు క్రియేట్ చేశారు. ఆయన మొత్తం పదవీకాలం కలుపుకుంటే 19 ఏళ్ల పై దాటుతుంది. బీహార్‌ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ 2005 నవంబరు నుండి మధ్యలో 278 రోజులు తప్ప కొనసాగుతూ వస్తున్నారు.

ఆ తరువాత వరసలో ఆర్జేడీ నాయకురాలు రబ్రీ దేవి ఉంటారు. ఇలా బీహార్ ని గత రెండు దశాబ్దాల కాలంలో పూర్తి స్థాయిలో పాలించిన నితీష్ కుమార్ ని విశేషంగానే చెప్పుకుంటారు. అంతే కాదు. ఆయన ఆరు సార్లు లోక్ సభకు ఎన్నిక అయ్యారు. అలా కేంద్రంలో మొదటిగా రైల్వే శాఖ ఉపరితల రవాణా శాఖ మంత్రిగా వ్యవహరించారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా సైతం పనిచేశారు.

ఆయన రైల్వే శాఖ మంత్రిగా ఉండగానే రైల్వే శాఖలో పలు అనేక మార్పులు తీసుకొచ్చాడు దీంట్లో ముఖ్యంగా ఇంటర్నెట్ సదుపాయంతో రైలు టికెట్ బుక్ చేసుకోవడం వంటివి గమనార్హం, తత్కాల్ టికెట్ బుకింగ్ కూడా ఈయన మంత్రిగా ఉన్న సమయంలోనే ప్రవేశపెట్టబడిందని చెప్పాల్సి ఉంటుంది. వాజ్ పేయి కి ఎంతో ఇష్టుడైన నితీష్ మీద అవినీతి మరకలు అయితే లేవు.

ఇవన్నీ ఇలా ఉంటే ఆయన విపక్షాల తరఫున ఒక దశలో ప్రధాని పదవికి అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేయబడ్డారు కానీ 2014 నుంచి నరేంద్ర మోడీ హవా దేశంలో సాగుతూండడంతో అది కుదరలేదు. 2025 అక్టోబర్ లో బీహార్ లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో నితీష్ మరోసారి తన నాయకత్వాన్ని పరీక్షించుకోవడానికి చూస్తున్నారు

ఈ నేపధ్యంలో నితీష్ కుమార్ కి భారత రత్న పేరుతో ఉన్న అత్యున్నత పౌర పురస్కారంతో గౌరవించాలని డిమాండ్ ఒకటి వినిపిస్తోంది. నితీష్ కుమార్ కి భారత రత్న ఇవ్వాలని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ అంటున్నారు. ఆయన బీహార్ కి మంచి పాలకుడిగా ఉన్నారని అధ్బుతమైన పనితీరుని కనబరచారని కూడా కొనియాడారు.

ప్రజలకు విశేష సేవలు అందించిన ఆయనకు భారత రత్న ఇవ్వాలని కేంద్ర మంత్రి కోరడం ఇపుడు చర్చనీయాంశం అయింది. నితీష్ కుమార్ జేడీయూకి చెందిన 12 మంది ఎంపీలు కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వానికి ఆక్సిజన్ గా మారారు. బీహార్ లో కూడా బీజేపీ ప్లస్ జేడీయూ కూటమిగా ఉన్నాయి.

నితీష్ సీనియర్ మోస్ట్ లీడర్ గా ఉన్నారు. ఇవన్నీ కాకుండా చూసినా ఆయన దేశానికి గత యాభై ఏళ్ళ పాటు చేసిన సేవలకు గానూ భారత రత్న ఇవ్వాలని జేడీయూ కూడా కోరుతోంది. ఇక ఆయనతో పాటు ఏకధాటిగా 24 ఏళ్ళ పాటు ఒడిషాను పాలించి ఎంతో అభివృద్ధి చేసి ప్రజల హృదాయాలను చూరగొన్న మాజీ సీఎం నవీన్ పట్నాయక్ కి కూడా భారత రత్న ఇవ్వాలని గిరిరాజ్ సింగ్ కోరుతున్నారు. మరి దీని మీద ఎన్డీయే ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాల్సి ఉంది.

Tags:    

Similar News