అంబటి వారి న్యాయ పోరాటాలు.. అప్పుడలా? ఇప్పుడిలా?
ఈ నేపథ్యంతో పోల్చుకుంటే.. మరి ఇప్పుడు అంబటి కూడా కోర్టును ఆశ్రయించారు. మరి దీనిని ఏమని భావించాలో ఆయనకే తెలియాలి. సరే.. తాజాగా అంబటి హైకోర్టుకు ఎక్కారు.
వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు గురించి అందరికీ తెలిసిందే. రాజకీయం గా ఆయన వేసే సెటైర్లు.. భిన్నమైన వ్యాఖ్యలు.. వంటివి నేతలకే కాదు.. ప్రజలకు కూడా ఆసక్తిగా ఉంటా యి. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా.. అంబటి ఎక్కడా తగ్గలేదు. పైగా.. అధికార కూటమిపై ఆయన వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. ఇక, ఇప్పుడు ఆయన నోటికి పనిచెబితే.. ప్రయోజనం లేదని అనుకున్నారో.. ఏమో.. నేరుగా.. న్యాయ పోరాటానికి దిగారు.
గతంలో వైసీపీ హయాంలో జరిగిన అన్యాయాలపై టీడీపీ నేతలు న్యాయపోరాటం చేసినప్పుడు.. గేలి చేసిన అంబటి ఇప్పుడు తన విషయానికి వచ్చే సరికి మాత్రం హైకోర్టును ఆశ్రయించడం గమనార్హం. నిజానికి న్యాయ పోరాటం చేయడం తప్పుకాదు. అసలు న్యాయ స్థానాలు ఉన్నదే.. ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు స్పందించేందుకు. కాబట్టి నాయకులు కూడా ప్రజల్లో భాగమేకనుక ఇలా చేయడం తప్పుకాదు. కానీ, అంబటి వారు మాత్రం గతంలో టీడీపీ నేతలపై వ్యంగ్యాస్త్రాలు సంధించేవారు.
''చంద్రబాబు కోర్టుకెళ్లాడు. నేరుగా ఎదుర్కొనే దమ్ములేదు'' అంటూ వ్యాఖ్యానించిన సందర్భాలు ఉన్నా యి. ఈ నేపథ్యంతో పోల్చుకుంటే.. మరి ఇప్పుడు అంబటి కూడా కోర్టును ఆశ్రయించారు. మరి దీనిని ఏమని భావించాలో ఆయనకే తెలియాలి. సరే.. తాజాగా అంబటి హైకోర్టుకు ఎక్కారు. సోషల్ మీడియాలో తమపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారని.. తన కుటుంబ పరువును తీస్తున్నారని.. దీనికి కారణం టీడీపీ సోషల్ మీడియానేనని ఆయన పేర్కొన్నారు.
దీనిపై తాను పోలీసులకు ఫిర్యాదులు చేసినా.. ఎవరూ పట్టించుకోలేదని అంబటి పేర్కొన్నారు. దీనిపై విచారణ చేసి.. తమకు న్యాయం చేయాలని.. పోలీసులు కేసులు పెట్టేలా ఆదేశించాలని కోరారు. అయితే .. ఇదే పని వైసీపీ హయాంలో చేసినప్పుడు వ్యంగ్యంగా మాట్లాడిన.. అంబటి.. ఇప్పుడు ఇలా వ్యాఖ్యానిం చడం.. కోర్టుకు వెళ్లడం వంటివి చర్చకు దారితీశాయి. ఏదేమైనా.. అధికారంలో ఉన్నప్పుడు.. ఉన్న నోరు ఇప్పుడు ఏమైందని అంటున్నారు. మరి అంబటి న్యాయ పోరాటం ఏమేరకు ఫలిస్తుందో చూడాలి.