భారత కుబేరుడు.. ప్రపంచ సంపన్నుల్లో ఒకరిగా చోటు దక్కించుకున్న రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ఇంట పెళ్లి సందడి షురూ అయినట్లుగా చెబుతున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ముకేశ్ పెద్ద కొడుకు ఆకాశ్ అంబానీ పెళ్లికి ఓకే అనేసినట్లుగా చెబుతున్నారు. తమ స్కూల్లో తనతో పాటు చదువుకున్న వజ్రాల వ్యాపారి.. రోజీ బ్లూ డైమండ్స్ అధిపతి రసెల్ మెహతా చిన్నకుమార్తె శ్లోకతో పెళ్లి జరగనుందని చెబుతున్నారు.
ఈ ఏడాది చివర్లో పెళ్లి.. మరికొద్ది నెలల్లో ఎంగేజ్ మెంట్ జరగనున్నట్లుగా తెలుస్తోంది. అయితే.. ఈ విషయం మీద రెండు కుటుంబాలు స్పందించేందుకు నో చెప్పాయి. ఒకవేళ..ఈ సమాచారం తప్పు అయితే ఖండించేవి కాబట్టి.. మౌనం అర్థాంగీకారంగా చెప్పొచ్చు.
ఇక.. ఈ పెళ్లి లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ గా అభివర్ణిస్తున్నారు. ఆకాష్.. శ్లోక ఇద్దరూ ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో కలిసి చదువుకున్నారని చెబుతున్నారు. ప్రస్తుతం ఆకాష్ రిలయన్స్ జియో బోర్డులో ఉన్నారు.
స్కూలింగ్ నుంచి ఇద్దరు కలిసి చదువుకోవటం.. ఆ స్నేహమే చివరకు ప్రేమగా మారిందని చెబుతున్నారు. కొన్ని వర్గాల సమాచారం ప్రకారం ప్లస్ టూ టైంలో ఆకాష్ ప్రపోజ్ చేశాడని.. శ్లోక అందుకు ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. అనంతరం ఉభయులు తమ కుటుంబాల్లో తమ ప్రేమ విషయాన్నిచెప్పటంతో.. ఇరు కుటుంబాలు మాట్లాడుకొని పెళ్లి విషయంలో సానుకూల నిర్ణయానికి వచ్చినట్లుగా చెబుతున్నారు.
అయినా.. అంబానీ కొడుక్కి పిల్లను ఇవ్వటానికి ఏ ఆడపిల్ల తండ్రి మాత్రం కాదంటాడు చెప్పండి. ఇక.. ఆకాష్ చాలా తక్కువ మందికి మాత్రమే పరిచయం. బయటకు పెద్దగా ఫోకస్ కాదు. వాస్తవానికి ముకేశ్ చిన్న కొడుకు ఐపీఎల్ పుణ్యమా అని.. భారీ సైజు కారణంగా అందరి కంట్లో పడ్డాడు. ఆ తర్వాత ఆ బొద్దు కుర్రాడు సన్నగా రివటాగా మారటం తెలిసిందే. ఇక.. ముకేశ్ ఫ్యామిలీ విషయానికి వస్తే.. అంబానీ.. రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు నీతా అంబానీల పెద్ద కొడుకు ఆకాష్. ఇతని కవల సోదరి ఇషా అంబానీ. తమ్ముడు అనంత్ అంబానీ. జియో కాన్సెప్ట్ తో పాటు.. ఈ ప్రోగ్రామ్ కి చీఫ్ వ్యూహకర్తగా చెబుతారు.
ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో ప్లస్ టూ పూర్తి అయ్యాక అమెరికాలోని బ్రౌన్ వర్సిటీలో అర్థశాస్త్రంలో డిగ్రీ పూర్తి చేశాడు. మంచి ఫోటోగ్రాఫర్ గా పేరుంది. జంతుప్రేమికుడిగా ఆకాశ్ ను అభివర్ణిస్తారు. ప్రపంచంలో ఎప్పటికప్పుడు మారుతున్న సాంకేతికతను అందిపుచ్చుకోవటానికి ఆకాశ్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడని చెబుతారు. ఇక.. ఆకాష్ పెళ్లాడాలనుకుంటున్న శ్లోక విషయానికి వస్తే.. ధీరూభాయ్ అంబానీ స్కూల్లో స్కూలింగ్ పూర్తి చేసిన తర్వాత ప్రిన్స్ టన్ వర్సిటీలో అంత్రోపాలజీలో డిగ్రీ చేశారు. అనంతరం ది లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ నుంచి లాలో మాస్టర్స్ పూర్తి చేశారు. దాదాపు నాలుగేళ్ల నుంచి (2014) రోజీ బ్లూ స్వచ్ఛంద సంస్థలో డైరెక్టర్ గా పని చేస్తున్నారు. ఎన్టీవోలను.. వాలంటీర్లను ఒక వేదిక మీదకు తీసుకొచ్చే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన కనెక్ట్ ఫర్ అనే సంస్థకు సహ వ్యవస్థాపకురాలు కూడా. వజ్రాల వ్యాపారి రసెల్ మెహతా ఆయన సతీమణి మోనాకు ముగ్గురు పిల్లలు అయితే.. వారిలో శ్లోక చిన్నది. కొసమెరుపు ఏమిటంటే.. ఇటీవల పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంలో దేశం మొత్తం వినిపించిన నీరవ్ మోడీకి మోనాకు బంధువులు కావటం.