పోలవరం ప్రాజెక్టుపై మంత్రి అంబటి రాంబాబు సం^è లన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు కాఫర్ డ్యామ్ కట్టకుండా డయాఫ్రమ్ వాల్ కట్టడం వల్లే సమస్య తలెత్తిందని అంబటి ఆరోపించారు. చంద్రబాబు చేసిన తప్పిదానికి వేరే దేశంలో అయితే ఉరి వేసేవారని హాట్ కామెంట్స్ చేశారు. కాపర్ డ్యామ్ కట్టకుండా డయాఫ్రమ్ వాల్ కట్టడానికి ఎందుకు అనుమతించారని పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)ని, కేంద్ర జలసంఘాన్ని (సీడబ్ల్యూసీ)ని, కేంద్రాన్ని అడుగుతామని చెప్పారు.
వరదలతో పోలవరం డయాఫ్రమ్ వాల్ ఏ మేరకు దెబ్బతిన్నదో ఇంకా నిర్ధారించలేదని.. ఇంకా సమయం పడుతోందని అంబటి రాంబాబు తెలిపారు. డయాఫ్రమ్ వాల్ దెబ్బ తినడంపై నిర్ధారణ వచ్చేంత వరకు పోలవరం ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ నిర్మాణం జరగదని తేల్చిచెప్పారు.
నేషనల్ హైడ్రో పవర్ కార్పోరేషన్ (ఎన్‌హెచ్‌పీసీ) నిర్ధారణ చేయడానికి సమయం పడుతుందని చెప్పిందన్నారు. పోలవరం సహా ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి కాకూడదని ప్రతిపక్ష టీడీపీ కోరుకుంటోందని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు అయితే తామే నిర్మిస్తామని చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు టేకప్ చేసిందని అంబటి నిలదీశారు.
డయాఫ్రమ్ వాల్ దెబ్బ తినడానికి టీడీపీ ప్రభుత్వం కారణం కాదా అని అంబటి రాంబాబు ప్రశ్నించారు. నెల్లూరు జిల్లాలో సంగం బ్యారేజీ చంద్రబాబు రెక్కల కష్టమని టీడీపీ సిగ్గు లేకుండా మాట్లాడుతోందని నిప్పులు చెరిగారు. చంద్రబాబు రెక్కలు లేని అక్కుపక్షి అని తీవ్ర విమర్శలు చేశారు. కమ్యూనిస్టులో.. బీజేపీ వాళ్లో రెక్కలిస్తే ఎగిరేవాడు చంద్రబాబు అని గుర్తు చేశారు.
చంద్రబాబు అధికారంలో ఉన్నన్నాళ్లూ ఒక్క ప్రాజెకై్టనా పూర్తి చేయాలని ఆలోచన చేశారా అని అంబటి రాంబాబు ప్రశ్నించారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబుకు రైతులకు నీళ్లిచ్చేందుకు ప్రాజెక్టులు కట్టాలనే ఆలోచన రాలేదా అని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బ్రిటీష్ కాలంలో కట్టిన ఆనకట్టలకు కాలం చెల్లిందని.. వాటి స్థానంలో కొత్త బ్యారేజీలను కట్టి వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రజలకు అందుబాటులోకి తెస్తోందని చెప్పారు. ఈ క్రమంలోనే సంగం బ్యారేజీ, నెల్లూరు బ్యారేజీ పూర్తి చేశామన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ప్రాజెక్టులన్నీ దివంగత వైఎస్సార్ ప్రారంభించినవేనన్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.