సుదీర్ఘకాలంగా టీడీపీలో కొనసాగిన టీడీపీ సీనియర్ నేత.. సినీ నిర్మాత.. ప్రముఖ వ్యాపారవేత్త అంబికా కృష్ణ బీజేపీలో చేరారు. ఢిల్లీలో రాంమాధవ్ సమక్షంలో ఆయన పార్టీ తీర్థం తీసుకున్నారు. కండువా కప్పుకున్నారు. ఏపీలో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో పలువురు నేతల చూపు ఇప్పుడు బీజేపీ మీద పడింది.
టీడీపీ దారుణ ఓటమితో కొందరు నేతలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని భావించగా.. పార్టీలో చేరే వారు ఎవరైనా తమ పదవులకు రాజీనామా చేసి మాత్రమే చేరాలని జగన్ కండీషన్ పెట్టటంతో.. ఇప్పుడు పలువురు తెలుగు తమ్ముళ్ల చూపు బీజేపీ మీద పడింది.
అదే సమయంలో బీజేపీ సైతం ఏపీలో తాము బలపడాలని భావించటం.. అందుకు తగ్గట్లే ఆపరేషన్ ఆకర్ష్ ను ప్రయోగించటంతో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఇటీవల నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరటం.. పార్టీని విలీనం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో టీడీపీ భవిష్యత్తు ఏమీ లేదన్న భావన అంతకంతకూ పెరుగుతోంది. దీంతో.. ఎంతోకాలంగా పార్టీలో ఉన్న వారు సైతం తాజాగా బీజేపీ వైపు చూస్తున్నట్లుగా చెబుతున్నారు.
తాజాగా పార్టీలో చేరిన అంబికా కృష్ణ మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో పలువురు టీడీపీ నేతలు బీజేపీలో చేరనున్నట్లుగా చెప్పి కొత్త బాంబు పేల్చారు.
ఇదిలా ఉంటే.. ఏపీలో టీడీపీని నిర్వీర్యం చేసేలా బీజేపీ అధినాయకత్వం పావులు కదపటం మొదలైంది. పలువురు తమ్ముళ్లు తమతో టచ్ లో ఉన్నట్లుగా చెబుతున్నారు. దీంతో.. ఏపీ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. తాజాగా పార్టీ మారిన అంబికా కృష్ణ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఎన్నికల్లో పార్టీ ఓటమికి కారణంగా చంద్రబాబేనని ఆయన స్పష్టం చేశారు.
ప్రధాని మోడీతో గొడవ వద్దని తాను ఎన్నోసార్లు చెప్పినా తన మాట వినలేదన్నారు. టీడీపీ ఓటమికి పూర్తి బాధ్యత బాబుదేనని చెప్పారు. తాను టీడీపీకి ద్రోహం చేయలేదని.. తనకే పార్టీ ద్రోహం చేసినట్లుగా వ్యాఖ్యానించారు. తానెంతో కష్టపడి పని చేస్తే పార్టీలో తనకు ప్రాధాన్యత ఇవ్వలేదని మండిపడ్డ ఆయన.. బీజేపీతో గొడవే ఇంతవరకూ వెళ్లిందన్నారు. బీజేపీతో విభేదాలకే తాజా పర్యవసానాలకు కారణంగా చెప్పారు. చూస్తుంటే.. రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ గతంలో ఎప్పుడూ ఎదుర్కోలేనంత సంక్షోభ పరిస్థితిని ఎదుర్కొవటం ఖాయమన్నభావన కలగటం ఖాయం.