ఐసిస్‌ పై అగ్ర‌దేశాల మూకుమ్మ‌డి టార్గెట్‌

Update: 2015-11-20 13:32 GMT
అంత‌ర్జాతీయ రాక్ష‌స‌మూక ఐసిస్‌ పై పోరాటంలో ప్ర‌పంచ దేశాల‌న్నీ క‌లిసిక‌ట్టుగా అడుగువేస్తున్నాయి. పారిస్‌ పై ఐసిస్ భీక‌ర‌ దాడి తరువాత ప్రపంచంలోని పెద్ద దేశాలన్నీ అలర్టై ఉగ్రవాదంపై యుద్ధం ప్రకటించిన సంగ‌తి తెలిసిందే. త‌మ ఐక్య‌త‌ను కేవ‌లం మాట‌ల‌కే వ‌దిలివేయ‌కుండా...ఆచ‌ర‌ణ‌లో చూపాయి. దాడుల‌కు గురైన పారిస్‌ తో పాటు అమెరికా - రష్యాదళాలు ఒక్కటై టెర్రర్ స్థావరాలపై విరుచుకుపడ్డాయి. ఈ క్ర‌మంలో ఆయా అగ్ర‌దేశాల ద‌ళాలు శ‌క్తివంత‌మైన బాంబుల వర్షం కురిపించాయి.

ఈ క్ర‌మంలో తీవ్ర‌వాదుల‌ను గుర్తించ‌డంలో అత్యున్న‌త టెక్నాల‌జీని వాడుకున్నాయి.  తీవ్రవాద స్థావరాలను గుర్తించడానికి అమెరికా సైన్యం అందించిన అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించింది. శాటిలైట్ ఫోకస్ - థర్మల్ ఇమేజెస్ అనే టెక్నాలజీతో ఉగ్రవాదులను టార్గెట్ చేసి పిట్టలను కాల్చనట్లు కాల్చింది. తమ సత్తా ఏంటో ప్రపంచానికి తెలియడం కోసం ఐసిస్‌ పై హై టెక్నాలజీతో అటాక్ చేసిన వీడియోను రిలీజ్ చేసింది. త‌ద్వారా ఐసిస్ పీచ‌ముడిచే స్థాయిలో త‌మ ద‌మ్ము ఉంద‌ని ప్ర‌క‌టించింది.
Tags:    

Similar News