మహమ్మారి వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి అనివార్య పరిస్థితుల్లో విధించిన లాక్ డౌన్ వల్ల విదేశాల్లో వేలాది మంది భారతీయులు చిక్కుకుపోయారు. వీరందరినీ స్వదేశాలకు తెచ్చేందుకు కేంద్రం వందే భారత్ మిషన్ చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అమెరికా నుంచి కూడా ఎయిరిండియా ప్రత్యేక విమానాలలో భారతీయులను స్వదేశానికి తీసుకువస్తున్నారు. అయితే, తాజాగా ఆ విమానాలను అడ్డుకునేందుకు అమెరికా ప్రయత్నాలు మొదలుపెట్టింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విమానాలలో టికెట్లను సాధారణ ప్రజలకు కూడా విక్రయిస్తున్నారని అమెరికా ఆరోపించింది. సాధారణ ప్రజల కోసం అమెరికా విమానాలను భారత్ లోకి అనుమతించడం లేదని, అటువంటపుడు ప్రత్యేక విమానాల్లో భారత్ సాధారణ పౌరులను ఎలా అనుమతిస్తుందని ప్రశ్నిస్తోంది.
ఎయిరిండియా వైఖరి వల్ల ఇరు దేశాల మధ్య ఉన్న పౌరవిమానయాన ఒప్పందానికి విఘాతం కలుగుతోందని యూఎస్ ట్రాన్స్ పోర్ట్ విభాగం అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఎయిరిండియా విమానాలపై కొత్త ఆంక్షలు 30రోజుల పాటు అమలవుతాయని ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో, 30 రోజుల పాటు అక్కడి వారిని భారత్ కు తరలించే అవకాశం లేకుండా పోయింది. అంతకుముందు, అమెరికన్ ఎయిర్ లైన్స్ కు చెందిన కంపెనీలు ఇండియాకు విమానాలను నడపకుండా భారత్ ఆదేశాలు జారీ చేసింది. అయితే, అమెరికాకు వెళుతున్న ఎయిర్ ఇండియా విమానాల్లో సాధారణ ప్రయాణికులు లండన్, ఫ్రాన్స్ తదితర దేశాలకు ప్రయాణాలు సాగిస్తున్నారు. దీంతో, ఎయిరిండియాపై అమెరికా ఆగ్రహంతో ఉంది. దీంతో ఎయిర్ ఇండియా విమానాలను నియంత్రించాలని అమెరికా భావించింది. వ్యాపార ధోరణితో ఎయిర్ ఇండియా వ్యవహరిస్తోందని, సగానికి పైగా సర్వీసులను ఎయిర్ ఇండియా నిర్వహిస్తోందని తెలిపింది. అదే సమయంలో ఒక్క అమెరికన్ విమానం కూడా ఇండియాకు రావడం లేదని తెలిపింది.