అనుకోని రీతిలో చోటు చేసుకున్న పరిణామంతో.. అమెరికా క్యాపిటల్ భవనం మూసివేయాలన్న నిర్ణయాన్ని తీసుకున్నారు. షాకింగ్ గా మారిన ఈ ఉదంతంలోకి వెళితే.. అధ్యక్ష భవనానికి సమీపంలో ఒక చెక్ పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. అలాంటివేళ.. ఒక కారు ఉన్నట్లుండి ఇద్దరు పోలీసులపైకి దూసుకెళ్లింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు.. అనుమానితుడిపై కాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్నారు.
అయితే.. ఈ ఉదంతంలో గాయపడిన పోలీసుతో పాటు.. కాల్పుల్లో గాయపడ్డ అనుమానితుడు ఆసుపత్రిలో మరణించారు. ఈ నేపథ్యంలో క్యాపిటల్ భవనాన్ని మూసివేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం అమెరికా కాంగ్రెస్ సమావేశాలు జరగటం లేదు.
అంతేకాదు.. ఈ భవనం వద్ద భారీగా నేషనల్ గార్డ్స్ ను మొహరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఉదంతం ఇప్పుడు షాకింగ్ గా మారింది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు అధికారి మృతికి అమెరికా అధ్యక్షుడు బైడెన్ తో పాటు.. ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ తమ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు.
ఏప్రిల్ ఆరు వరకు వైట్ హైస్ లో అమెరికా జాతీయ జెండాను అవనతనం చేయాలని ఆదేశించారు. ఈ జనవరి ఆరున.. ట్రంప్ మద్దతుదారులు పెద్ద ఎత్తున క్యాపిటల్ భవనం మీదకు దాడి చేయటం.. ఆ సందర్భంగా జరిగిన కాల్పుల్లోఒక పోలీసు అధికారితో సహా.. ఐదుగురు చనిపోవటం తెలిసిందే. ఆ ఉదంతం ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటన తర్వాత చోటు చేసుకున్న అతి పెద్ద ఘటన ఇదే.