చైనా నుండి అమెరికాకు కొరియర్ లో విత్త‌నాలు ... వణికిపోతున్న అమెరికన్లు !

Update: 2020-07-29 12:30 GMT
అగ్రరాజ్యం అమెరికా ఇప్పటికే కరోనా దెబ్బకి వణికిపోతోంది. ప్రపంచంలోనే అగ్రరాజ్యం అయినప్పటికీ కూడా కరోనా ను అరికట్టలేక అన్ని దేశాల వలే వ్యాక్సిన్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అమెరికాలో ఇప్పటివరకు 44 లక్షల మందికి పైగా కరోనా భారిన పడగా .. లక్షన్నర మంది కరోనా భారిన పడి మరణించారు. ప్రస్తుతం అమెరికా మొత్తం కరోనా కోరల్లో చిక్కుకొని బయటపడటానికి శతవిధాలా ప్రయత్నాలు చేస్తుంది. ప్రస్తుతం కూడా ప్రతి రోజు సుమారుగా 60 వేలకి పైగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. ఇలా కరోనాను ఎదుర్కోలేక ఇప్పటికే సతమతమౌతున్న అమెరికా కి ఇప్పుడు మరో సమస్య వచ్చి పడింది.

తాజాగా చైనా నుంచి వ‌చ్చిన గుర్తుతెలియని విత్త‌నాల‌తో కూడిన‌ పార్శిళ్లు అమెరిక‌న్ల‌ ను భయాందోళనకు గురి చేస్తున్నాయి. యూఎస్ ‌లోని సుమారు 27 రాష్ట్రాల ప్రజలని ఈ విత్త‌నాల పార్శిళ్లు భయపెడుతున్నాయి. వర్జీనియా, వాషింగ్టన్, అరిజోనా, ఇండియానా, లూసియానా, టెక్సాస్‌ ల‌తో పాటు ఇత‌ర‌ రాష్ట్రాలకు చెందిన కొంతమంది అడ్రస్ లకి ఈ విత్తనాల పార్శిళ్లు రావ‌డం ప్ర‌స్తుతం ఆందోళన కలిగిస్తుంది. కరోనా వ్యాప్తి చెందుతున్న సమయంలో ఎవరు ఆర్డర్ చేయకపోయినా కూడా ఈ విత్తనాలు కొరియర్ లో రావడం పై అమెరికా అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

అలాగే ఆ పాకెట్స్ పై చైనా భాష ఉంది. దీనితో ఈ విత్తనాలు ఎక్కడా భూమిలో నాటవద్దని, ఇవి హానికారక విత్తనాలు కావొచ్చ‌ని శాస్త్రవేత్తలు అనుమానం వ్యక్తం చేశారు. ప్రస్తుతం విత్తనాల గుట్టుర‌ట్టు చేసే ప‌నిలో అమెరికా అధికారులు, శాస్త్ర‌వేత్త‌లు నిమగ్నమై ఉన్నారు. అసలు ఏ ఉద్దేశ్యంతో ఈ విత్తనాలు అమెరికన్లకు పంపారో తేల్చే ప‌నిలో ఉన్నారు. క‌నుక కొరియర్‌లో ఇలాంటి విత్తనాల పార్శిళ్లు వ‌చ్చిన వారు వీటితో అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని, ఆ పాకెట్స్ రాగానే అధికారులకి తెలియజేయాలని తెలిపారు.. ఇప్పటికే కరోనా విషయం లో చైనా పై ఒంటికాలుమీద లేస్తున్న అమెరికా ..ఈ విత్తనాల పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ..
Tags:    

Similar News