అప్ఘనిస్తాన్ తాలిబన్ల వశమైంది. అప్ఘనిస్తాన్ నుంచి సైనిక బలాలను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించిన వెంటనే తాలిబన్లు యాక్టివ్ అయ్యి అప్ఘనిస్తాన్ ను ఆక్రమించేశారు. అమెరికా సైన్యం వైదొలగగానే తాలిబన్లు ఆక్రమించుకున్నారు. అప్ఘనిస్తాన్ నుంచి సైనిక బలాల ఉపసంహరణ.. అటుపై తాలిబన్ల అలవోక ఆక్రమణ పరిణామాల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ పై అంతర్జాతీయ సమాజం నుంచి తీవ్ర ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అమెరికా-నాటో దళాల ఉపసంహరణ ద్వారా తాలిబన్ల చేతికి దేశాన్ని అప్పజెప్పాలంటూ అప్ఘన్ ప్రభుత్వం, ప్రజలు సైతం అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ పై దుమ్మెత్తి పోస్తున్నారు.ఈ క్రమంలోనే మీడియా ముందుకు వచ్చిన జోబైడెన్ స్పందించారు. కీలక ప్రకటన చేశాడు.
అప్ఘనిస్తాన్ నుంచి అమెరికా బలగాల ఉపసంహరణకు కట్టుబడి ఉన్నామని.. రెండు దశాబ్ధాల తర్వాత సరైన నిర్ణయం తీసుకున్నామని జోబైడెన్ తెలిపారు. ఈ నిర్ణయంపై మేం చింతించడం లేదన్నారు.
అమెరికా ముందు రెండే దారులున్నాయని.. ఒకటి అమెరికా దళాలను వెనక్కి రప్పించుకోవడం.. రెండోది మూడో దశాబ్ధంలోనూ మరింత సైన్యాన్ని పంపి మోహరింపు కొనసాగించడం.. రెండోదారిలో కొనసాగకూడదనే మా నిర్ణయం ముమ్మాటికీ సరైందనే భావిస్తున్నాం అని జోబైడెన్ వెల్లడించారు.
అప్ఘనిస్తాన్ లో జాతి నిర్మాణం అమెరికా బాధ్యత కాదని.. అమెరికాపై ఉగ్రవాదులను నిరోధించడమే లక్ష్యం అని జోబైడెన్ స్పష్టం చేశారు. 20 ఏళ్ల క్రితం అప్ఘనిస్తాన్ లో అల్ ఖైదాను అంతం చేశాం. బిన్ లాడెన్ ను పట్టుకునేందుకు మేం వెనక్కి తగ్గలేదు. రెండు దశాబ్ధాలుగా అప్ఘన్ సైన్యానికి శిక్షణ ఇచ్చాం. ప్రభుత్వానికి మనో ధైర్యం అందించాం. కానీ వాళ్లు పోరాట శక్తిని ప్రదర్శించలేకపోయారు. అక్కడి ప్రభుత్వం ఊహించిన దానికంటే వేగంగా పతనమైంది అని జోబైడెన్ వైఫల్యాన్ని అప్ఘనిస్తాన్ ప్రభుత్వంపై నెట్టేశారు.
ప్రస్తుతం అప్ఘనిస్తాన్ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నామని.. అవసరమైతే అప్ఘన్ ఉగ్రవాదంపై పోరాటం చేస్తామని.. అప్ఘన్ ప్రజలకు అమెరికా సహకారం ఎప్పుడూ ఉంటుందని జోబైడెన్ తేల్చిచెప్పారు. తాలిబన్ల చర్యలను చూస్తూ ఊరుకోబోమని జోబైడెన్ హెచ్చరించారు.
అప్ఘన్ నుంచి అమెరికా ప్రతినిధులను వెనక్కి రప్పించామని.. అమెరికా సైన్యానికి సాయం చేసిన అప్ఘన్ ప్రజలను సైతం అవసరమైన చేయూత అందిస్తామని స్పష్టం చేశారు.