పుంజుకున్న అమెరికా ఆర్థిక వృద్ది.. ప్ర‌పంచానికి రిలీఫ్!

Update: 2022-10-29 16:30 GMT
అమెరికాకు జ‌లుబు చేస్తే.. ప్ర‌పంచం తుమ్ముతుంద‌నే సామెత అంద‌రికీ తెలిసిందే. ఏర‌కంగా చూసినా అమెరికా ప్ర‌భావం ప్ర‌పంచ దేశాల‌పై ఎక్కువ‌గానే ఉంటుంది. మ‌రీ ముఖ్యంగా ఆర్థిక ప‌ర‌మైన విష‌యాలైతే.. అమెరికా డాల‌ర్‌తోనే దాదాపు సగానికిపైగా ప్ర‌పంచ దేశాల‌తో త‌మ మార‌కాన్ని లెక్క‌వేసుకుంటున్నాయి. దీంతో అమెరికా డాల‌ర్‌పై ఏమాత్రం ప్ర‌భావం ప‌డినా.. వెంట‌నే దాని ఎఫెక్ట్ ప్ర‌పంచ దేశాల‌పై ప‌డుతోంది. ఈ క్ర‌మంలోనే డాల‌రుతో మార‌కం విలువ పెరగ‌డం.. ఆయా దేశాల‌ను ఆర్థిక క‌ష్టాల్లోకి నెట్టేస్తోంది. క‌రోనా అనంత‌రం కాలంలో ప్ర‌పంచం ఈ ప‌రిస్థితినే చ‌వి చూసింది. ముఖ్యంగా క‌రోనా స‌మ‌యంలో దెబ్బ‌తిన్న ప‌రిశ్ర‌మ‌లు.. ఉపాధి రంగం కార‌ణం కూడా.. ఈ ప‌రిస్థితికి దారి తీసింది.

అయిన‌ప్ప‌టికీ.. అమెరికా డాల‌ర్ ప్ర‌భావ‌మే ప్ర‌పంచం మొత్తాన్ని ఇప్ప‌టికీ శాసిస్తోంది. దీంతో అమెరికాలో ఆర్థిక ప‌రిస్థితుల‌ను ప్ర‌పంచ దేశాలు వెయ్యి క‌ళ్ల‌తో వీక్షిస్తుంటాయి. ఇక్క‌డ తీసుకునే నిర్ణాలు.. స్టాక్ మార్కెట్ల‌ను ప్ర‌భావితం చేయ‌డం.. తెలిసిందే. గ‌త కొన్నాళ్లుగా.. అమెరికా వృద్ది రేటు మంద‌గిస్తున్న ద‌రిమిలా.. ప్ర‌పంచ మార్కెట్లు కుద‌లేవుతున్నాయి. దీంతో ప‌రిస్థితి చేజారే వ‌ర‌కు వ‌స్తోంద‌నే హెచ్చ‌రిక‌లు ఆర్థిక నిపుణుల నుంచి వినిపించాయి.

ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రంలో తొలి రెండు త్రైమాసికాలు కూడా.. అమెరికా వృద్ధి రేటు ఒడిదుడుకులు ఎదుర్కొంది. ఆర్థిక సంవత్సరం జనవరి- మార్చి మొదటి త్రైమాసికంలో అమెరికా వృద్ధి 1.6% ఉండగా.. రెండవ త్రైమాసికంలో జీడీపీ 0.6 శాతంగా ఉంది.

అయితే.. తాజాగా ఇంది జోరందుకుని పుంజుకోవ‌డం గ‌మ‌నార్హం.  మూడో త్రైమాసికం డేటా ప్రకారం జీడీపీ వృద్ధి 2.6 శాతంగా న‌మోదైంది. దీంతో బైడెన్ ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది. అంతేకాదు.. ప్ర‌పంచ వ్యాప్తంగా కూడా..  ఆర్థిక మాంద్యం బయాలకు ఈ ప‌రిణామం బ్రేక్  వేసింద‌నే చెప్పాలి.  

దీంతో వడ్డీ రేట్ల పెంపు, అధిక ద్రవ్యోల్బణం వంటివాటి నుంచి ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌జ‌ల‌కు ఉప‌శ‌మ‌నం ల‌భించే అవకాశం క‌నిపిస్తోంది.  గురువారం విడుదల చేసిన బ్యూరో ఆఫ్ ఎకనామిక్ ఎనాలిసిస్ Q3లో US ఎగుమతులు పెరిగినట్లు వెల్లడైంది. పైగా వినియోగదారుల వ్యయం, నివాసేతర స్థిర పెట్టుబడులు మెరుగుపడ్డాయని డేటా చూపుతోంది.

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఆర్థిక వ్యవస్థ నెమ్మదించిన తరుణంలో తాజా గణాంకాలు ఖచ్చింతంగా పెద్ద ఊరట అని చెప్పుకోవాలి. అయితే, ఖచ్చితమైన వివ‌రాలు నవంబర్ 30, 2022న విడుదల అవుతాయి. గడచిన 40 ఏళ్లలో అమెరికాలో ద్రవ్యోల్బణం ఇంత భారీ స్థాయికి చేరుకోవటం ఇదే తొలిసారి కావటం, వడ్డీ రేట్లు అమాంతం పెరగటం భారత్ పై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపాయి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News