అమిత్ షా నోరు జారి బుక్ అయ్యారా?

Update: 2018-08-12 04:13 GMT
దూకుడుగా వ్య‌వ‌హ‌రించే విష‌యంలో మోడీషాల తీరే వేరుగా ఉంటుంద‌ని చెప్పాల్సిన అవ‌స‌రం ఉండ‌దు. కింది స్థాయి నుంచి ఎదిగిన కార‌ణంగా వ‌చ్చిన‌ అల‌వాటో ఏమో కానీ.. ఉత్త పుణ్యానికే నోరు పారేసుకోవ‌టంలో ఇద్ద‌రూ ఘ‌నాపాఠిలే. ప్ర‌స్తుతం తామున్న స్థాయిని ప‌ట్టించుకోకుండా రాజ‌కీయ ప్ర‌యోజ‌నం కోసం ఎంత‌కైనా సిద్ధ‌మ‌న్న‌ట్లుగా ఇరువురూ వ్య‌వ‌మ‌రిస్తుంటారు.

ఇదే రీతిలో వ్య‌వ‌హ‌రించిన మోడీ తీరుతో.. దేశ ప్ర‌ధాని హోదాలో ఉన్న నేత రాజ్య‌స‌భ‌లో మాట్లాడిన మాట‌ల్ని తొలిసారి రికార్డుల నుంచి తొల‌గిస్తూ.. రాజ్య‌స‌భ ఛైర్మ‌న్ వెంక‌య్య నాయుడు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. వ్య‌క్తిత్వ వికాస నిపుణుడిగా వ్య‌వ‌హ‌రించే మోడీ నోటి నుంచి అంత‌లా బ్యాలెన్స్ త‌ప్పిన మాట‌లు ఎలా?  అంటే.. విష‌యాల్ని వ్య‌క్తిగ‌తంగా తీసుకోవ‌టం.. తానున్న స్థాయిని.. స్థానానికి ఉన్న ప‌రిమితుల్ని పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌టమే కార‌ణ‌మ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

తాజాగా అలాంటి పొర‌పాటే చేసి అడ్డంగా బుక్ అయ్యారు బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా. తాజాగా ఆయ‌న ప‌శ్చిమ బెంగాల్ లో ప‌ర్య‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.ఈ  సంద‌ర్భంగా కోల్ కోతాలో బీజేపీ నిర్వ‌హించిన రోడ్ షోలో మాట్లాడిన షా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

తాను మాట్లాడుతున్న మాట‌ల్ని ప్ర‌సారం చేస్తున్న ఛాన‌ళ్ల‌ను మ‌మ‌త స‌ర్కార్ బ్లాక్ చేయించింద‌న్నారు. మీరు ఛాన‌ళ్ల‌ను బ్లాక్ చేయొచ్చు కానీ బీజేపీ కార్య‌క‌ర్త‌లు రాష్ట్రంలోని ప్ర‌తి చోటుకి నా సందేశాన్ని తీసుకెళ‌తారన్నారు. ఈ సంద‌ర్భంగా ప‌శ్చిమ బెంగాల్ ప్ర‌భుత్వంపైనా ఆయ‌న మండిప‌డ్డారు. ఇదిలా ఉంటే.. షా వ్యాఖ్య‌ల్ని తృణ‌మూల్ కాంగ్రెస్ నేత‌లు తీవ్రంగా మండిప‌డ్డారు. షా మ‌రో ప్లాప్ షోను నిర్వ‌హించార‌ని.. ఆయ‌న దాన్ని క‌ప్పిపుచ్చుకోవ‌టానికి ప్ర‌య‌త్నిస్తున్నార‌న్నారు. తాము షా ప్ర‌సంగాన్ని టెలికాస్ట్ చేయ‌కుండా ఛాన‌ళ్ల‌ను బ్లాక్ చేశామ‌ని బీజేపీ ఆరోపిస్తుంద‌ని.. అలా బ్లాక్ చేసే అల‌వాటు బీజేపీకే సొంత‌మంటూ విరుచుకుప‌డ్డారు.

వారికి ప‌శ్చిమ బెంగాల్ సంస్కృతి తెలీద‌ని.. బీజేపీకి అల‌వాటైన ప‌నులు త‌మ మీద రుద్ది బెంగాలీల‌ను అవ‌మానించొద్ద‌న్నారు. అమిత్ షా చేసిన ఆరోప‌ణ‌ల్ని 72 గంట‌ల్లో నిరూపించుకోవాల‌ని.. తాము బ్లాక్ చేసిన ఛాన‌ళ్ల వివ‌రాలు బ‌య‌ట‌పెట్టాల‌ని స‌వాల్ విసిరారు. ఈ త‌ర‌హా బ్లాక్ మొయిల్ రాజ‌కీయాల‌కు పాల్ప‌డ‌టం షాకు అల‌వాటేన‌న్నారు. అమిత్ షా చేసిన ప్ర‌సంగం అన్ని ఛాన‌ళ్ల‌లో టెలికాస్ట్ అయ్యింద‌ని.. షా చేసిన ఆరోప‌ణ‌ల్ని రుజువు చేయాలంటూ తృణ‌మూల్ కాంగ్రెస్  మండిప‌డింది. పార్టీ అధికారిక ట్విట్ట‌ర్ ఖాతాలో బీజేపీకి స‌వాల్ విసిరారు. మ‌రి.. దీనిపై షా ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
Tags:    

Similar News