తెలుగు రాజకీయాలను ప్రభావితం చేసే స్థాయిలో ఇప్పటిదాకా మీడియా ఉంది. ఒక విధంగా చెప్పాలీ అంటే తెలుగు రాష్ట్రాలలో ఒక ప్రధాన రాజకీయ పార్టీకి మీడియా సహకారం నూటికి రెండొందలు శాతం ఉంది అని అంతా ఒప్పుకునే మాటే. ఆ అనుబంధం అలాగే కొనసాగుతోంది కూడా. ఇక ఆ మీడియా మొఘల్ కి దేశ రాజకీయ నేతలతో మంచి రిలేషన్స్ ఉన్నాయి. ఆయన ఎవరో కాదు చెరుకూరి రామోజీరావు. ఆయన బలమైన మీడియా దిగ్గజం. ఆయన్ని కలవడానికి ప్రత్యేకంగా బీజేపీ అగ్రే నేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా వస్తున్నారు అంటే అది రాజకీయాల్లో సంచలనమే అని చెప్పాల్సిందే.
ఈ నెల 21న మునుగోడులో బీజేపీ సభ జరగనుంది. దానికి కేంద్ర మంత్రి అమిత్ షా వస్తున్నారు. ఆయన ప్రొగ్రాం చాలా కాలం క్రితమే డిజైన్ చేయబడింది. అయితే రీసెంట్ గా కొన్ని మార్పులు చేర్పులు చేశారు. దానిని బట్టి చూస్తే అమిత్ షా మునుగోడులో జరిగే సభను ముగించుకుని రోడ్డు మార్గం గుండా ఫిల్మ్ సిటీకి వెళ్తారు అని తెలుస్తోంది. ఈ సందర్భంగా ఆయన మీడియా దిగ్గజం రామోజీరావుతో ప్రత్యేకంగా భేటీ అవుతారని అంటున్నారు. ఈ భేటీ ఏకంగా నలభై అయిదు నిముషాల పాటు సాగనుంది అన్నదే ఇపుడు హాట్ టాపిక్.
ఇక అమిత్ షా ఫిల్మ్ సిటీ వెళ్ళడం ఇది రెండవసారి. మొదటిసారి 2018 జూలో ఆయన ఫిల్మ్ సిటీకి వెళ్ళి రామోజీరావుతో భేటీ అయ్యారు. నాడు ఆయన బీజేపీ జాతీయ ప్రెసిడెంట్ హోదాలో కలుసుకున్నారు. అనాడు బీజేపీ దేశవ్యాప్తంగా సంపర్క్ ఫర్ సమర్ధన్ కార్యక్రమంలో భాగంగా రామోజీరావుని కలిసారు. కానీ ఈసారి మాత్రం అజెండా అంటూ ఈ భేటీకి లేదు అంటున్నారు. పైగా చివరి నిముషంలో సడెన్ గా ఈ భేటీని షెడ్యూల్ చేశారు అని అంటున్నారు.
మరి అమిత్ షా అంటే బీజేపీకి సర్వం సహా. ఇక రామోజీరావు అంటే తెలుగు రాజకీయాల్లో ఏ పార్టీకి మద్దతుగా ఉంటారో విపక్షాలు చెబుతాయి. అంటే వచ్చే ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాలలో మీడియా మద్దతు బీజేపీకి ఉండేలా రామోజీరావుని అమిత్ షా కోరుతారా అన్న చర్చ ఒక వైపు ఉంది. అలాగే మునుగోడు ఉప ఎన్నికల్లో గెలవాలని బీజేపీ చూస్తోంది. దానికి మద్దతుగా అమిత్ షా రామోజీరావుని కలుస్తున్నారా అన్న చర్చ కూడా ఉంది.
ఇక ఈ చర్చలో ఏపీలో టీడీపీతో బీజేపీ పొత్తు అంశం కూడా చర్చకు వచ్చే చాన్స్ ఉంటుంది అని అంటున్నారు. ఇక టీయారెస్ కి మద్దతు గా తెలుగు మీడియా లేకపోయినా న్యూట్రల్ గా ఉంటోంది. ఇపుడు బీజేపీ తానుగా వచ్చి హెల్ప్ కోరితే తెలంగాణాలో కూడా తెలుగు మీడియా, అందునా టాప్ లెవెల్ లో ఉండే మీడియా తన స్టాండ్ మార్చుకుని తెలుగు రాజకీయాల్లో మునుపటి దూకుడు చూపించే అవకాశాలు ఉన్నాయా అన్న సందేహాలు ఉన్నాయి.
ఏది ఏమైనా అమిత్ షా రామోజీరావుల భేటీ మాత్రం తెలుగు రాజకీయాల్లో సంచలనమే అంటున్నారు. రేపటి రోజున రెండు తెలుగు రాష్ట్రాలలో కొత్త రాజకీయానికి బాటలు వేస్తుందా అన్న చర్చ కూడా ఉంది. దాంతో అటు టీయారెస్, ఇటు వైసీపీ కూడా ఈ పరిణామాలను ఆసక్తిగా గమనిస్తున్నాయిట. ఫిల్మ్ సిటీ పాలిటిక్స్ రేపటి రాజకీయాన్ని మార్చుతుందా. ఏమో చూడాలి.