భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలకు సంబంధించి నిన్న జరిపిన నియామకం చూసి చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయట. బీజేపీ ఏపీ వ్యవహారాల ఇంఛార్జిగా కేరళకు చెందిన వి.మురళీధరన్ ను బీజేపీ నియమించింది.. అయితే, ఈయన విషయంలో చంద్రబాబు కొంచెం కూడా కంగారుపడడం లేదు. చిక్కంతా సహాయ ఇంఛార్జి నియామయంతోనే. ఏపీ బీజేపీకి సహాయ ఇంచార్జిగా మహారాష్ట్రకు చెందిన సునీల్ దేవధర్ ను నియమించడంతో చంద్రబాబు తెగ కంగారు పడుతున్నట్లు తెలుస్తోంది. అందుకు కారణం తెలిసిందే... ఇసుకలోంచి నూనె తీసినట్లుగా. ఇతర పార్టీల కంచుకోటల నుంచి కూడా బీజేపీకి ఓట్ల వర్షం కురిపించ గల సమర్ధుడు ఈ సునీల్ దేవధర్. పైగా వేరే రాష్ట్రంలో పని కదా అని అప్పుడప్పుడు వచ్చి వెళ్లే రకం కాదీయన... ఏకంగా తనకు అప్పగించిన స్టేట్లో తిష్ఠవేసి.. అక్కడి తిండే అలవాటు చేసుకుని - అక్కడి భాషే నేర్చుకుని మరీ అదే మాట్లాడుతూ తన యాక్షన్ ప్లాన్ మొదలుపెడతాడు. అందుకే చంద్రబాబులో భయం మొదలైందట.
సునీల్ దేవధర్ పేరు మొన్నటి త్రిపుర ఎన్నికలతో బాగా పాపులర్ అయింది. దశాబ్దాలుగా సీపీఎం పాలనలో ఉన్న త్రిపురలో అంతకుముందు బీజేపీ డిపాజిట్లు సాధిస్తేనే పెద్ద గొప్పలా ఉండేది. అలాంటిది.. ఏకంగా అక్కడ అధికారం కొల్లగొట్టేలా చేశారు సునీల్. 2013లో త్రిపురలో 50 చోట్ల బీజేపీ పోటీ చేస్తే ఒకే ఒక చోట డిపాజిట్ దక్కింది. కానీ.... 2014కి వచ్చేసరికి మొత్తం త్రిపుర బీజేపీ చేతుల్లోకి వచ్చేసింది. దీని వెనుక ఉణ్నది సునీల్. ఎన్నికలకు 500 రోజుల ముందు నుంచి త్రిపురలోనే తిష్ట వేశారాయన. అక్కడి ప్రజలు మాట్లాడే ప్రధాన భాషలతో పాటు గిరిజన భాషలూ నేర్చేసుకున్నారు. స్టెప్ బై స్టెప్ తన ప్లాన్ అమలు చేసి ఎవరూ ఊహించని రీతిలో బీజేపీకి అధికారం అందించారు.
అయితే.. సునీల్ చరిత్ర అక్కడే మొదలవ్వలేదు. అంతకుముందు కూడా అన్నీ అలాంటి టఫ్ టాస్క్లే. 2014లో మోదీ పోటీ చేసిన వారణాసి నియోజకవర్గానికి సునీలే ఇంఛార్జి . మోదీ ఏరికోరి ఆయన్ను పెట్టుకున్నారు.
అంతేకాదు... మహారాష్ట్రలో 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు తొలుత 32 నియోజకవర్గాల బాధ్యత అప్పగించారు. కానీ.. అమిత్ షా ఆ రాష్ట్రంలో పర్యటించినప్పుడు సునీల్ ను ఆ బాధ్యత నుంచి తప్పించి ఏజెన్సీ ప్రాంతమైన పాల్గఢ్ జిల్లాలోని దహానూ నియోజకవర్గంలో బీజేపీ గెలుపుకోసం పనిచేయాలని సూచించారు. మహారాష్ట్రంలో సీపీఎం చేతిలో ఉన్న ఏకైక నియోజకవర్గమది. ఆ ఎస్టీ నియోజకవర్గంలో అంతవరకు బీజేపీ ఎప్పుడూ గెలవలేదు. కాంగ్రెస్, కమ్యూనిస్టులే గెలుస్తూ వస్తున్నారు. అమిత్ షా సూచనతో అక్కడికి వెళ్లిన సునీల్ దహానూ నియోజకవర్గాన్ని బీజేపీ పరం చేయగలిగారు.
అంతకుముందు 2012లో గుజరాత్లో మోదీ మూడోసారి ముఖ్యమంత్రి పదవిని అందుకునే ప్రయత్నంలో జరుగుతున్న ఎన్నికలు. ప్రభుత్వంపై వ్యతిరేకత కనిపిస్తోంది.. ఎలాగైనా గెలవాలన్నది మోదీ లక్ష్యం. ఆ క్రమంలోనే దహోడ్ జిల్లాను సునీల్ కుఅప్పగించారు. అక్కడ ఆరు నియోజకవర్గాలుంటే కేవలం ఒక్కరే బీజేపీ ఎమ్మెల్యే, మిగతా అయిదుగురూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. కానీ.. సునీల్ ఆ జిల్లాలో సీను మార్చేశారు. ఆరులో మూడు చోట్ల బీజేపీ అభ్యర్థులను గెలిపించారు.
ఇలాంటి స్ట్రాంగ్ ట్రాక్ రికార్డున్న సునీల్ దేవధర్ను ఏపీలో ప్రయోగిస్తుండడంతో ఆయన్ను ఎలా ఎదుర్కోవాలా అని చంద్రబాబు బుర్రకు పదును పెడతున్నారట. ఎన్నికల వ్యూహాల్లో దిట్ట అయిన సునీల్ ఏపీ బీజేపీ నేత రాంమాధవ్ కు సన్నిహితుడు కూడా. అంతేకాదు.. సోషల్ మీడియాలో ఆయన కింగ్. దీంతో సునీల్ దేవధర్ పేరు ప్రకటించగానే ఏపీ విషయంలో బీజేపీ సీరియస్ గానే వర్క్ చేయడానికి రెడీ అయినట్లు అర్థమవుతోంది.