తెలంగాణలోని హుజూరాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా రాజకీయం ఎన్నికల సమయం దగ్గర పడేకొద్ది వేడెక్కుతోంది. ఈ ఉప ఎన్నిక ప్రచారాన్ని అధికార పార్టీ టీఆర్ ఎస్ ధీటుగా హోరెత్తించాలని బీజేపీ నిర్ణయం తీసుకుంది. నువ్వా.. నేనా అన్నట్లు ప్రచారం జోరందుకుంటోంది. ఇక కేంద్ర హోశాఖ మంత్రి అమిత్ షా సభతో ఈ ప్రచారాన్ని ముగించాలని భావిస్తోంది కాషాయ దళం. అయితే వేయి మందికి మించి బహిరంగ సభ, ర్యాలీలు నిర్వహించవద్దని ఎన్నికల సంఘం ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.
ముందుగా అమిత్‌షా సభను రద్దు చేసుకున్నా, తాజా పరిణామాలు చూస్తుంటే భారీగా సభ నిర్వహించాలని కమలం అగ్రనేతలు నిర్ణయించినట్లు సమాచారం. కాగా, ఈ ఉప ఎన్నికలో ఈటల రాజేందర్ గెలుపును బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తమ అభ్యర్థి గెలుపునకు ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోవద్దని భావిస్తోంది బీజేపీ. హుజూరాబాద్ లో తప్పకుండా బీజేపీ జెండా ఎగురవేయాలని బీజేపీ నాయకత్వం ఆదేశాలు జారీ చేయడంతో ఆ దిశగా అడుగులు వేస్తోంది రాష్ట్ర నాయకత్వం. వ్యూహాలు, ప్రతివ్యూహాలతో ముందుకు సాగుతోంది.
టీఆర్ ఎస్ కు ఏకైక ప్రత్యామ్నాయం బీజేపీనే అనే సంకేతాన్ని ప్రజల్లో బలంగా వినిపించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఈ ఎన్నికల్లో ఈటల రాజేందర్ గెలుపును బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఓటర్లను చేరుకునేందుకు ఉన్న ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోవద్దని నిర్ణయించింది. హుజూరాబాద్‌లో కచ్చితంగా గెలిచి తీరాల్సిందేనని జాతీయ అధినాయకత్వం కూడా కచ్చితమైన ఆదేశాలు జారీచేయడంతో ఆ దిశగా వ్యూహాలు, ప్రతివ్యూహాలతో కార్యాచరణ ప్రణాళికలను రాష్ట్ర నాయకత్వం రూపొందిస్తోంది.
కమలం నేతలు కూడా అమిత్‌షా సభ ఏర్పాటు చేసి ప్రచారానికి చెక్ పెట్టాలని అభిప్రాయానికి వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. కేసీఆర్ బహిరంగ సభ నిర్వహించే అవకాశాలుండటంతో అందుకు తగ్గట్లుగా బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. ఇందుకు భారీ ఎత్తున అమిత్‌షా సభ నిర్వహించేందుకు రెడీ అవుతున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. అమిత్‌షాతో పాటు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొనేలా ప్లాన్ వేస్తున్నట్లు సమాచారం. అలాగే కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రచారంలో విస్తృతంగా పాల్గొనేలా ప్రచారం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ నెల 16 లేదా 17 తేదీల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హుజూరాబాద్ ఎన్నికల ప్రచారా న్ని ప్రారంభించనున్నట్లు సమాచారం. నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో విస్తృతంగా పర్యటిం చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చే వారం, పది రోజు లపాటు అన్ని మండలాల్లో క్షేత్రస్థాయి వరకు ఓటర్లను చేరుకునేలా కార్యక్రమాలు సిద్ధం చేస్తున్నారు. మూడు లేదా నాలుగు పోలింగ్ బూత్‌లు కలిపి ఒక శక్తి కేంద్రంగా ఏర్పాటు చేసి, ఆ స్థాయిలో ప్రజలను కలుసుకునేందుకు వివిధఎన్నికల కమిటీలను ఇప్పటికే ఏర్పాటు చేశారు.ఏది ఏమైనా హుజూరాబాద్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న పార్టీలు ఎవరు విజయం సాధిస్తారో వేచి చూడాల్సిందే.