అజిత్ పవార్ గత నాలుగు రోజులుగా దేశ రాజకీయాలలో మారుమోగిపోతున్న పేరు ఇది. మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం మూడు రోజుల పాటు నడవడానికి ఈ ఎన్సీపీ నేత అజిత్ పవారే కారణం. గత శుక్రవారం రోజు సాయంత్రం శివసేన - ఎన్సీపీ - కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అంతా సిద్ధం అని అనుకుంటున్న తరుణంలో .. తెల్లవారేసరికి ఎన్సీపీ నేత అజిత్ పవార్ బీజేపీ తో చేతులు కలిపి .. మహారాష్ట్ర లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కావడానికి సహాయం చేసారు. అలాగే డిప్యూటీ సీఎం గా ప్రమాణస్వీకారం చేసారు.
ఇకపోతే అజిత్ పవార్ పై పలు అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఈడీ కేసులు కూడా నమోదయ్యాయి. అజిత్ పవార్ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 70 వేల కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం చేసినట్టు ఆయన పై ఆరోణలు వచ్చాయి. ఈ కేసుల నుండి బయటపడేస్తాం అని చెప్పి అజిత్ ని బీజేపీ తమవైపు తిప్పుకుంది అనే వార్తలు కూడా వచ్చాయి. అజిత్‌తో కలిసి దేవేంద్ర ఫడ్నవిస్ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశాక.. ఈ కేసుల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రూ. 70వేల కోట్ల ఇరిగేషన్ స్కామ్ కేసులో అజిత్ పవార్ కు ఏసీబీ క్లీన్ చిట్ ఇచ్చినట్టు కథనాలు వెలువడ్డాయి. దీనితో బీజేపీ కి మద్దతు ఇచ్చినందుకు అజిత్ కి బీజేపీ ఇచ్చిన బహుమానం ఇదే అంటూ వార్తలు బాగా వైరల్ అయ్యాయి.
ఈ నేపథ్యంలోనే అజిత్ పై ఏసీబీ కేసుల ఎత్తివేత మీద శివసేన సుప్రీం కోర్టును కూడా ఆశ్రయించింది. అయితే ఆ తరువాత మహారాష్ట్ర రాజకీయాలలో అనేక కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పన్నిన వ్యూహం తో బీజేపీ ప్రభత్వం మూడు రోజుల్లోనే దుకాణం సర్దేసింది. రాయభారాలకి దిగొచ్చిన అజిత్ ఎట్టకేలకు డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేశారు. ఆ తరువాత సీఎం గా ఫడ్నవిస్ కూడా రాజీనామా చేసారు. అజిత్ మళ్లీ ఎన్సీపీ గూటికి చేరుకున్నారు. పార్టీలోనే కొనసాగుతున్నట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు - కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. అవినీతి కేసుల విషయంలో అజిత్ కు క్లీన్ చిట్ ఇవ్వలేదంటూ షాక్ ఇచ్చారు. అజిత్ పై కేసులు ఎత్తివేయలేదని ఆయన స్పష్టం చేశారు. అజిత్ పవార్ వెంట బీజేపీ నడవదని - బీజేపీ వెంటే అజిత్ వస్తారని అమిత్ షా చెప్పారు.