మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మరింత అభివృద్ధి జరగాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సిఎంలతో ఆదివారం ఆయన ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో భేటీ అయ్యారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ప్రస్తుత పరిస్థితులు, పోలీసుల పనితీరుుపై ఈ భేటీలో చర్చించారు. మావోయిజాన్ని పూర్తిగా నియంత్రించేందుకు ఆయా రాష్ట్రాలు కఠిన చర్యలు తీసుకోవాలని, మావోయిస్టులపై ఉక్కుపాదం మోపాలని అమిత్ షా సిఎంలకు సూచించారు. ఆయా రాష్ట్రాల్లో శాంతిభద్రతలు, అభివృద్ధి కార్యక్రమాలు, సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. నాలుగేళ్లలో మావోయిస్టుల కార్యకలాపాలు తగ్గాయని హోంశాఖ అధికారులు అమిత్ షాకు వివరించారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ సహకరిస్తే రాష్ట్రంలో మావోయిజాన్ని పూర్తిగా అంతమొందిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక అన్నారు. ఈక్రమంలో అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను రాష్ట్రానికి అందిస్తామని తెలిపారు. వామపక్ష తీవ్రవాదంపై పది రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఆదివారం చర్చించిన అమిత్ షా, ఆదివారం రాత్రి కూడా కేసీఆర్ తో భేటీ అయ్యారు. సోమవారం మధ్యాహ్నం నార్త్ బ్లాక్ లో సీఎం కేసీఆర్ సమక్షంలోనే తెలంగాణ పోలీసు ఉన్నతాధికారులు అమిత్ షాకు మావోయిస్టుల కార్యకలాపాల గురించి గంటా 40 నిమిషాల పాటు సవివరంగా ప్రజెంటేషన్ ఇచ్చారు.
ఇందులో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్, ఆ శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా, ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ అర్వింద్ కుమార్, తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి, రాష్ట్ర గ్రేహౌండ్స్ చీఫ్ కొత్తకోట శ్రీనివాస రెడ్డి, పలువురు సీఆర్‌పీఎఫ్ అధికారులు పాల్గొన్నారు. మావోయిస్టులను ఎదుర్కోవడానికి తెలంగాణలో ఇప్పటివరకు చేపట్టిన ఆపరేషన్లపై ఈసందర్భంగా సమీక్షించారు. ఛత్తీ్‌సగఢ్, మహారాష్ట్ర సరిహదుల్లో నిఘా వ్యవస్థ, సాంకేతికత వినియోగం, డ్రోన్ల సాయంతో నిఘా పటిష్టం చేసే అంశంపై తెలంగాణ పోలీసు ఉన్నతాధికారులు వివరించారు.
రాష్ట్రం నుంచి మావోయిస్టు పార్టీలో కీలక స్థానాల్లో ఉన్న వారి వివరాలను తెలిపారు. పొరుగు రాష్ట్రాలతో ఇంటెలిజెన్స్ సమాచారాన్ని పంచుకోవడంపై వివరించారు. మావోయిస్టు అగ్రనేతల లొంగుబాటు, ప్రభావిత జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. తెలంగాణ ప్రభుత్వ ప్రజెంటేషన్ తర్వాత దాదాపు గంట సేపు ఒడిశా ప్రభుత్వానికి చెందిన పోలీసు అధికారులతో భేటీ అయిన హోంమంత్రి అమిత్ షా.. ఆంధ్రా-ఒడిశా సరిహద్దు (ఏఓబీ)లో మావోయిస్టుల కదలికలపై చర్చ జరిపారు.