కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుధవారం ఆసుపత్రిలో చేరారు. సాధారణ ఎన్నికలు ముగిసిన తర్వాత జాతీయ రాజకీయాల్లో - కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల్లో ఊపిరి సలపనంత బిజీగా ఉన్న ఆయన ఓ చిన్న సర్జరీ కోసం ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. అమిత్ షా ముక్కుకు చిన్నపాటి సర్జరీ చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన బుధవారం అహ్మదాబాద్ లోని కేడీ ఆస్పత్రిలో చేరారు.
ఈ చిన్న సర్జరీ జరిగిన తర్వాత ఆయన బుధవారం సాయంత్రానికి అమిత్ షా డిశ్చార్జ్ కానున్నట్టు తెలుస్తోంది. ఢిల్లీలోనే ఉంటోన్న అమిత్ షా ఓ కుటుంబ కార్యక్రమంలో పాల్గొనేందుకు అహ్మదాబాద్ వచ్చారు. అక్కడ పని ముగించుకున్న వెంటనే ఆయన నేరుగా ముక్కుకు సర్జరీ కోసం కేడీ ఆస్పత్రికి వెళ్లినట్టు సమాచారం.
ఇక ఈ యేడాది జనవరిలో కూడా అమిత్ షా స్వైన్ ఫ్లూకు గురయ్యారు. అప్పుడు ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఆయనకు జనవరిలో తీవ్రమైన ఛాతీ సమస్యలు రావడంతో శ్వాసకోస సంబంధిత సమస్యలు వచ్చాయి. ఎయిమ్స్ ఆసుపత్రి వైద్యులు పరీక్షలు చేసి.. ఆయనకు స్వైన్ ఫ్లూ ఉన్నట్టు గుర్తించి చికిత్స అందించడంతో కొద్ది రోజులకు ఆయన కోలుకున్నారు.
అప్పటి నుంచి సాధారణ ఎన్నికల కోసం ఆయన దేశం అంతటా తిరగడంతో పాటు బీజేపీ గెలుపు కోసం తీవ్రమైన వ్యూహాలో మునిగిపోయారు. ఇప్పుడు కాస్త విశ్రాంతి దొరకడంతో ముక్కుకు సర్జరీ చేయించుకుంటున్నారు.