పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో రాజకీయ వేడి తారాస్థాయికి చేరుతోంది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారం షెడ్యూల్ కు ముందే వేడెక్కింది. అధికార - ప్రతిపక్షాలైన బీజేపీ - కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా ఆ రెండు పార్టీల అధ్యక్షులు సెటైర్లు వేసుకున్నారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా నవశక్తి సమావేశంలో మాట్లాడుతూ.. రాహుల్ ను అనుకరించారు. ఈ మిమిక్రి సోషల్ మీడియాలో వైరల్ అయింది.
రాహుల్ బాబా అంటూ హేళన చేసిన అమిత్ షా `ఎందుకంతలా అరుస్తున్నావ్.. నాలుగేళ్లలో మోడీ ఏం చేశారని ప్రశ్నిస్తున్నావ్.. మా లెక్కలు అడుగుతావా.. ప్రజలు మీ నాలుగు తరాల లెక్కలు అడుగుతున్నారు` అంటూ అమిత్ షా రాహుల్ కు సెటైర్ వేశారు. నీరవ్ మోదీ - రాఫెల్ డీల్స్ పై ప్రధాని మోదీడీ రాహుల్ ప్రశ్నించడంపై అమిత్ షా ఇలా స్పందించారు. అసలు నీరవ్ మోడీ కేసులో మోదీ ప్రభుత్వం స్పందించినంత వేగంగా ఏ ప్రభుత్వమూ స్పందించలేదని షా చెప్పారు. కర్ణాటకలోని సిద్ధరామయ్య ప్రభుత్వాన్నీ ఆయన కడిగిపారేశారు. సిద్ధరామయ్య ప్రభుత్వం మూడు డీలను ఫాలో అవుతుంది.. అవి ధోకా (మోసం) - దాదాగిరి - డైనస్టిక్ పాలిటిక్స్ (వారసత్వ రాజకీయాలు) అని అమిత్ షా అన్నారు.
కాగా, అవినీతిపై పోరాటానికి లోక్‌పాల్ ఏర్పాటు చేయడంలో జాప్యం ఎందుకు చేస్తున్నారని ప్రధానిని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రశ్నించారు. కొమ్ముకాస్తున్న సంపన్నులను కాపాడుకునేందుకే మోడీ ప్రయత్నిస్తున్నారని విమ ర్శించారు. కర్ణాటకలోని రామదుర్గలో సోమవారం జరిగిన బహిరంగసభలో రాహుల్ ప్రసంగించారు. తనను తాను కాపలాదారుగా చెప్పుకున్న మోడీ - దేశంలో కుంభకోణాలు జరుగుతున్నా ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. కాగా, లింగాయత్ ల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ఉత్తర కర్ణాటకలో పర్యటిస్తున్న రాహుల్ వరుసగా ఆలయాలను సందర్శిస్తున్నారు. బెల్గామ్ లోని సౌందతిలో ఉన్న ఎల్లమ్మ ఆలయాన్ని, రామదుర్గలోని గోడ్చి వీరభద్ర ఆలయాన్ని దర్శించుకున్నారు. అక్కడి సాంప్రదాయ డప్పును మోగించారు. తన ప్రసంగాల్లో బసవేశ్వరుడి ప్రవచనాలను ప్రస్తావించడం ద్వారా రాహుల్ లింగాయత్ లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
Full View