సెప్టెంబర్ 17. నిజాం రాచరిక పాలనలో ఉన్న హైదరాబాద్ సంస్థానం భారత దేశంలో విలీనం అయిన రోజు. ఈ రోజు కేంద్రంగా ఇప్పుడు తెలంగాణపై కొత్త అస్త్రాలు రెడీ చేస్తోంది బీజేపీ. తెలంగాణ ఏర్పడప్పటి నుంచి ఈ రోజును విమోచనం - విలీనం - విద్రోహ దినంగా దేన్ని చేయాలో తెలియక కేసీఆర్ సర్కారు మౌనం దాల్చింది. ముస్లింల ఓటు బ్యాంకు ప్రబలంగా టీఆర్ ఎస్ కు ఉండడంతో తెలంగాణకు స్వేచ్ఛ వచ్చిన రోజును జరపడానికి సందేహిస్తోంది. ముస్లిం ఓటు బ్యాంకు దూరమవుతుందన్న భయంతోనే ఈ రోజును పక్కనపెట్టేసిందన్న విమర్శలు ఉన్నాయి.
కానీ తెలంగాణలో బలపడాలని యోచిస్తున్న బీజేపీ ఈరోజును అంత తేలిగ్గా వదలిపెట్టేలా కనిపించడం లేదు. ఇప్పటికే సెప్టెంబర్ 17న కేంద్ర హోంమంత్రి - బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాను హైదరాబాద్ రప్పిస్తున్నారు. తెలంగాణ విమోచనదినం సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేయించేందుకు రెడీ అయ్యారు.
అంతేకాదు తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్.. హైదరాబాద్ లో తెలంగాణ విమోచన కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. సెప్టెంబర్ 17 న తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతీ జిల్లాకో విమోచన కమిటీ ఏర్పాటు చేసి రాష్ట్రవ్యాప్తంగా దీన్ని పండుగలా చేయడానికి సిద్ధమవుతున్నారు.
తెలంగాణలో బలపడాలనుకుంటున్న బీజేపీకి ఇప్పుడు సెప్టెంబర్ 17ను అందివచ్చిన అవకాశంగా మార్చుకోవాలని యోచిస్తోంది. ఈరోజును వినియోగించుకొని టీఆర్ ఎస్ ను ఇరుకునపెట్టాలని భావిస్తోంది. ఏకంగా అమిత్ షా రాష్ట్రానికి రానుండడంతో సెప్టెంబర్ 17న తెలంగాణలో ఏం జరగనుందనే ఉత్కంఠ రోజురోజుకు పెరిగిపోతోంది.