దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కురుస్తున్న వర్షాలతో సామాన్య జనానికే కాకుండా సెలిబ్రిటీలకు తిప్పలు తప్పడం లేదు. భారీ వర్షాలతో నగరం స్తంభించిపోయింది. దీనిపై ట్విటర్‌లో స్పందించిన బాలీవుడ్ సూపర్ స్టార్, బిగ్ బీ అమితాబ్ బచ్చన్.. *దేవుళ్లు మనపై ఆగ్రహించారు. భారీ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. ఎవరూ బయటకి రాకుండా సురక్షితంగా ఇంట్లోనే ఉండండి* అంటూ ముంబైకర్లకు స్వీట్ వార్నింగ్ జారీ చేశారు.
అమితాబ్ బచ్చన్ మాత్రమే కాకుండా బాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాత శిరీష్ కుందర్ కూడా ఈ వర్షాలపై ట్విటర్‌లో స్పందించారు. వర్షాల గురించి తమ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయని ఆయన పేర్కొనడం విశేషం. ఆయన భార్య వర్షాలు ఆగాలని ప్రార్థిస్తుంటే.. ఆయన పిల్లలు మాత్రం వర్షాలు ఇలాగే కొనసాగాలని దేవుడిని కోరుకుంటున్నారట. భారీ వర్షాలు పడితే పాఠశాలలకు సెలవులొస్తాయని అందుకే తన పిల్లలు వర్షం కురవాలని భావిస్తున్నారట.
కాగా భారీ వర్షాలతో ముంబై మహా నగరం అతలాకుతలమైంది. జనజీవనం అస్తవ్యస్తమైంది. ఇవాళ కూడా భారీ స్థాయిలో వర్షం పడే సూచనలు ఉన్నాయి. దీంతో అక్కడ స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. నగరంలోని వీధులన్నీ నీటితో నిండిపోయాయి. సబర్బన్ రైళ్లు ఎక్కడిఎక్కడే నిలిచిపోయాయి. ఇవేకాకుండా వర్షం కారణంగా మరికొన్ని రైళ్లను రద్దు చేశారు.