తెలంగాణ విమోచనం.. అమిత్ షా పెద్ద ప్లాన్లు?

Update: 2022-09-14 17:30 GMT
తెలంగాణ విమోచన దినోత్సం గడువు సమీపిస్తోంది. సెప్టెంబర్ 17కు ఇక ఎంతో దూరంలో లేదు. ఇంకో మూడు రోజులే మిగిలి ఉంది. 17న విమోచన దినోత్సవం జరపడానికి అటు కేంద్రప్రభుత్వం సన్నాహాలు చేస్తుండగా.. ఇటు టీఆర్ఎస్ సర్కార్ కూడా ఈసారి రెడీ అయ్యింది. ఏడాది పొడవునా ఈ వేడుకలను నిర్వహించి అధికార టీఆర్ఎస్ ను ఉక్కిరి బిక్కిరి చేయాలని అమిత్ షా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

కేంద్రంలోని బీజేపీ పెద్దలు తెలంగాణపై దండయాత్ర చేస్తూ సెప్టెంబర్ 17ను టార్గెట్ చేసి 'తెలంగాణ విమోచన దినోత్సవాన్ని' ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. దీనికి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతోపాటు కర్ణాటక, మహారాష్ట్ర సీఎంలు కూడా తరలివస్తున్నారు. తెలంగాణ ప్రభుతవ్ం చేయలేని పనిని.. కేంద్రం అధికారికంగా చేస్తుండడంతో కేసీఆర్ సర్కార్ డిఫెన్స్ లో పడింది.అందుకే కేబినెట్ సమావేశం పెట్టిన కేసీఆర్ 'తెలంగాణ విలీన దినోత్సవ వజ్రోత్సవాలు' పేరిట మూడు రోజులు నిర్వహించాలని డిసైడ్ అయ్యింది. ఈ మేరకు తాజా కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు.

ఈ సెప్టెంబర్ 17 నాటికి తెలంగాణ రాష్ట్రం దేశంలో విలీనమై 75 ఏళ్లు అవుతుంది. సెప్టెంబర్ 17ను 'తెలంగాణ జాతీయ సమైక్యతా దినం'గా పాటించాలని కేబినెట్ నిర్ణయించింది. సెప్టెంబర్ 16, 17, 18 తేదీల్లో మూడు రోజుల పాటు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల పేరిట ప్రారంభవేడుకలను నిర్వహించాలని డిసైడ్ అయ్యారు.

తెలంగాణ విమోచన దినోత్సవాలను ఏడాది పొడవునా నిర్వహించడానికి కేంద్రప్రభుత్వం సన్నాహాలు చేపట్టింది. ఆర్ఎస్ఎస్ ఇప్పటికే అమృతోత్సవాలుగా జరుపుకుంటామని ప్రకటించింది. దీనికి అనుగుణంగా కేంద్ర కూడా ఏడాది పాటు ఉత్సవాలను నిర్వహించనుంది. ఇందులో మూడు రాష్ట్రాలు విలీనమై ఉండడం కలిసి వచ్చే అంశంగా భావిస్తోంది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించే సభ సందర్భంగా దీనిపై అమిత్ షా కీలక ప్రకటన చేస్తారని సమాచారం.

ఇక కేంద్రంలోని యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ తాజాగా దీనికి సంబందించిన ఉత్తర్వులను జారీ చేసింది. తెలంగాణ సహా కర్ణాటక, మరఠ్వాడ ప్రాంతాల్లో అన్ని యూనివర్సిటీలు, కళాశాలలు విద్యాసంస్థల్లో హైదరాబాద్ విమోచన దినోత్సవాలు నిర్వహించేలా ఆదేశించింది. హీరోలతో డాక్యుమెంటరీలు తీయించి ప్రజల్లోకి బలంగా వెళ్లాలని సూచించింది.

దీంతో తెలంగాణ విమోచనపై బీజేపీ సీరియస్ గా ముందుకెళుతూ అధికార టీఆర్ఎస్ ను ఉక్కిరిబిక్కిరి చేసే ఎత్తుగడ వేసింది. ఈ పరిణామం ఖచ్చితంగా బీజేపీకి లాభిస్తుందని అంచనావేస్తోంది.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News