వివిధ రాష్ట్రాలకు ఉపాధి కోసం పోయి కరోనా-లాక్ డౌన్ తో 50 రోజులకు పైగా చిక్కుకుపోయిన వలస కూలీలను కేంద్రం ప్రత్యేక శ్రామిక్ రైళ్లు వేసి తరలిస్తోన్న సంగతి తెలిసిందే. మొదట ఈ రైళ్ల చార్జీలు వలస కూలీతే పెట్టుకోవాలని కేంద్రం సూచించింది. అయితే దీనిపై పెద్ద వివాదం చెలరేగింది. కేసీఆర్ సైతం వలసకూలీల వద్ద డబ్బులు వసూలు చేస్తారా అని నిలదీశాడు. తానే కడుతానన్నాడు.
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ముందుకొచ్చి వలస కూలీల రైలుచార్జీలు తాము భరిస్తామంటూ ప్రకటన చేశారు. దీంతో అలెర్ట్ అయిన కేంద్రం 85శాతం కేంద్రం భరిస్తామని.. 15శాతం రాష్ట్రాలు భరించాలని కోరింది. దీంతో వలస కూలీలను ఉచితంగా రైళ్లలో ఆయా రాష్ట్రాలకు తరలిస్తోంది.
అయితే తాజాగా పంజాబ్ నుంచి బీహార్ లోని ముజఫర్ పూర్ బయల్దేరే శ్రామిక్ రైలు కూలీలతో వారింగ్ స్టేషన్ లో నిలవగా అక్కడి అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యే అమరీందర్ రాజా అక్కడికి వచ్చాడు.. వలస కూలీల ముందు ప్రసంగించాడు. మీ రైలు చార్జీలను సోనియమ్మ చెల్లించారని.. ఈ కరపత్రంలో రాశామని.. రైలులో ప్రయాణిస్తూ చదువుకోండని కరపత్రాలను వలస కూలీలకు పంచిపెట్టారు.
ఇలా వలస కూలీల క్రెడిట్ కోసం అటు కాంగ్రెస్ నేతలు ఆరాటపడగా.. డ్యామేజ్ మాత్రం బీజేపీకి వచ్చింది. మొదట డబ్బులు కట్టాలని చెప్పిన బీజేపీ సర్కార్ ఇప్పుడు తనే భరించి ఉచితంగా పంపిస్తున్నా అందరి దృష్టిలో మాత్రం విలన్ గా మారిపోయింది.