పంజాబ్ రాష్ట్రంలో అధికారిక లెక్కల ప్రకారమే 7.2 లక్షల మంది డగ్ర్ బానిసలు ఉన్నారని తాజాగా ఎన్డీడీటీసీ సర్వే నివేదిక నిగ్గు తేల్చింది. ఇక అనధికారికంగా ఇంకా మూడు రెట్ల మంది యువత డ్రగ్స్ బానిసలుగా ఉంటారని లెక్కతేల్చింది. దీన్ని బట్టి పంజాబ్ రాష్ట్రంలోని యువత ఇప్పుడు డ్రగ్స్ కు బానిసై తమ నిండు జీవితాలను నాశనం చేసుకుంటున్నారని అర్థమవుతోంది.. డ్రగ్స్ తో పిచ్చివాళ్లై ఆస్పత్రుల పాలవుతున్నారు.
తాజాగా పంజాబ్ లో డ్రగ్స్ కు బానిసైన ఓ యువతి కథకు అమృతసర్ ఎంపీ, కాంగ్రెస్ నేత గుర్జీత్ సింగ్ అజులా చలించిపోయారు. కాలేజీలో చదువుతూ కొందరు అలవాటు చేసిన డ్రగ్స్ కు బానిసైన కూతురును డీ అడిక్షన్ సెంటర్ లో ఉంచి చికిత్స చేయించింది ఆ తల్లి. ప్రభుత్వాసుపత్రులు, అధికారుల చుట్టు తిరిగినా ఆ మాదక ద్రవ్యాల మత్తు ఆమెను వీడలేదు. దీంతో చేసేదేం లేక ఇంట్లోని మంచానికి గొలుసులతో కట్టేసింది. కన్నబిడ్డను అలా గొలుసులతో కట్టేసిన వైనం అందరి హృదయాలను కరిగించింది. ఎంపీకి ఈ విషయం తెలిసి ఆయన ఆ యువతిని సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు ముందుకు వచ్చారు.
డ్రగ్స్ కు చికిత్స చేయాలని తాను ఆస్పత్రులకు వెళ్లినా వైద్యులు పట్టించుకోవడం లేదని యువతి తల్లి ఎంపీ గుర్జీత్ సింగ్ ఎదుట వాపోయింది. మహిళల కోసం పంజాబ్ వ్యాప్తంగా ఒకటే డీ అడిక్షన్ సెంటర్ ఉంది. ఇక అందరికీ డీ అడిక్షన్ సెంటర్లు ఉన్నా అందులో పెద్ద ఎత్తున డ్రగ్స్ కు బానిసైన యువత ఉండడంతో ఈ అమ్మాయికి సరైన చికిత్స లభించలేదు. దీంతో ఎంపీ స్వయంగా ఈమెకు చికిత్స అందించి బాగుచేయిస్తానని హామీ ఇచ్చారు.
పంజాబ్ లో డ్రగ్స్ కు బానిసైన యువత సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. పంజాబ్ లోనే ఏకంగా రెండేళ్లలో 160 మంది డ్రగ్స్ కారణంగా చనిపోవడం పరిస్థితి తీవ్రతకు అద్ధం పడుతోంది. దీంతో సీఎం అమరీందర్ సింగ్ తాజాగా ప్రత్యేక పోలీసులను ఏర్పాటు చేసి డ్రగ్స్ ను అరికడుతున్నారు. ఇప్పటికే 28వేల మంది డ్రగ్స్ అమ్ముతున్న వారిని అరెస్ట్ చేశారు.