కరోనా వైరస్ పేరువింటేనే ఇప్పుడు అందరూ భయంతో వణికిపోతున్నారు. ఈ భయంతోనే కరోనా పాజిటివ్ వచ్చింది అని తెలిసినా కూడా చాలామంది , ఆసుపత్రిలో చేరడం లేదు. అలాగే కొంతమంది కరోనా పాజిటివ్ వస్తే ఎక్కడ కరోనా కేంద్రానికి తరలిస్తారేమో అనే భయంతో కరోనా టెస్టు చేసే సమయంలోనే ఫోన్ నెంబర్ , వారి అడ్రస్ ను తప్పుగా నమోదు చేస్తున్నారు. కరోనా కంటే ..కరోనా వస్తే ఆస్పత్రిలో చికిత్స తీసుకోవాలంటేనే చాలా మంది బయటపడుతున్నారు. హాస్పిటల్ కి మేము అంటూ అక్కడి నుండి పారిపోతున్నారు. వైద్య సిబ్బందితో సైతం గోడవకు దిగి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.తాజాగా కరీంనగర్ జిల్లా శంకరపట్నంలోనూ ఇలాంటి ఘటనే వెలుగు చూసింది.
ఈ మద్యే , ఓ వృద్ధురాలు కరోనా బారిన పడటంతో ఆమెను కరీంనగర్ లోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు అంబులెన్సు వచ్చింది. ఆస్పత్రికి తాను రానంటూ అక్కడే మొండికేసింది. అయితే , అతి కష్టం మీద ఆమెను తరలించే ఏర్పాటు చేశారు. కానీ ఎలాగైనా ఆస్పత్రికి వెళ్లకూడదని అనుకునే ఆమె ఓ పథకం వేసింది. మార్గమధ్యలో తాను మూత్ర విసర్జనకు వెళ్లాలని చెప్పి అంబులెన్స్ దిగింది.ఆపై అక్కడినుంచి తప్పించుకుని శంకరపట్నం చేరుకుంది. అక్కడి బస్టాండ్ పరిసరాల్లో ఆ వృద్దురాలు తిరుగుతున్నట్లు అంబులెన్సు సిబ్బందికి సమాచారం అందింది. దీంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు.
అయితే రోడ్డు పైనే బైఠాయించిన వృద్దురాలు హాస్పిటల్ కి వెళ్లడానికి అస్సలు ఇష్టపడలేదు. ఆ తరువాత సిబ్బంది చాలా సేపు ఆమెకి మంచి మాటలు చెప్పి, ఇలా చేయడం వల్ల ఇంకొంతమందికి కూడా వ్యాధి అంటుకునే అవకాశం ఉందని చెప్పి హాస్పిటల్ లో మంచి చికిత్స అందిస్తామని , నెగటివ్ రాగానే మళ్లీ ఇంటికి పంపిస్తామని చెప్పారు. దీనితో చివరకు వారితో ఇష్టం లేకుండానే వెళ్ళింది. దీనితో అక్కడి వారందరూ ఊపిరి పీల్చుకున్నారు.