అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు భారతదేశంలో దక్కిన అరుదైన గౌరవం ఇది. ఏకంగా ఒక ఊరి పేరునే ట్రంప్ పేరుతో మార్చేశారు. రాజస్థాన్ లో మేవాట్ అని ఉన్న ఆ ఊరి పేరు ఇక నుంచి అది ట్రంప్ విలేజ్ గా మారనుంది. ఈ ఊరిని అభివృద్ధి చేస్తున్న ప్రముఖ ఇండియన్ సోషల్ వర్కర్ పేరు మార్పును ప్రకటించారు. భారత్ - అమెరికా మధ్య మెరుగైన సంబంధాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సులభ్ ఇంటర్నేషనల్ ఫౌండర్ బిందేశ్వర్ పాఠక్ వెల్లడించారు.
ఇండియాలో ఓ గ్రామం పేరును ట్రంప్ విలేజ్ గా మారుస్తున్నాను అని ఆయన వాషింగ్టన్ లో ప్రకటించారు. గ్రామాల్లో మెరుగైన పారిశుద్ధ్యం కోసం తాను ప్రయత్నిస్తున్నట్లు ఓ కమ్యూనిటీ ప్రోగ్రామ్ లో పాల్గొన్న బిందేశ్వర్ పాఠక్ చెప్పారు. ఇండియాలో పారిశుద్ధ్యం, స్వచ్ఛత లక్ష్యాలను అందుకునేందుకు ఇండియన్ అమెరికన్లు ప్రయత్నించాలని బిందేశ్వర్ కోరారు. భారత్ తో అమెరికాకు మంచి సంబంధాలు ఉన్నాయని ఈ కార్యక్రమంలో పాల్గొన్న వర్జీనియాకు చెందిన రిపబ్లికన్ లీడర్ ఎడ్ గిలెస్పీ అన్నారు.
ఇదిలాఉండగా..అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అధికారానికి వచ్చిన తరువాత మొదటిసారిగా ప్రధాని నరేంద్రమోదీ ఆ దేశంలో పర్యటించనున్నారు. ఈ నెల 25 నుంచి ప్రధాని పర్యటన ప్రారంభమవుతుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. 26న అధ్యక్షుడు ట్రంప్ తో సమావేశమై హెచ్1బీ వీసా నిబంధనల్లో మార్పులతోపాటు అనేక అంశాలపై మోడీ చర్చలు జరుపుతారని పేర్కొంది. ఈ చర్చలు ఉభయ దేశాల ద్వైపాక్షిక సంబంధాలకు నూతన దిశను కల్పిస్తాయని ఆశాభావం వ్యక్తం చేసింది. ప్రాంతీయ భద్రత, పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదంతోపాటు పలు అంతర్జాతీయ అంశాలు వారిద్దరి మధ్య చర్చకు రావచ్చని తెలిపింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/