ప్ర‌ధాని కూడా ప‌ట్టించుకోని ఎంపీ ?

Update: 2022-07-06 00:30 GMT
ట్రిపుల్ ఆర్ (ర‌ఘురామ కృష్ణం రాజు) వివాదం రోజురోజుకూ ముదురుతోంది. ఆయ‌నకు జెడ్ ప్ల‌స్ కేట‌గిరీ ఇచ్చి ఉన్నార‌ని ఓ మీడియా అంటోంది కానీ కిష‌న్ రెడ్డి లాంటివారు అస్సలు ఆ ఎంపీనే ప‌ట్టించుకోలేదు. రాజ‌కీయ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించేందుకు ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వ్ ను నిర్వ‌హించ‌డం లేద‌ని కూడా తేల్చేశారు. అంటే అర్థం ఏంటి పీఎంఓ కూడా ర‌ఘురామ‌ను ప‌ట్టించుకోలేదు.

కానీ తాను బీజేపీకి అత్యంత స‌న్నిహితంగా ఉండే ఎంపీన‌ని అంటుంటారాయ‌న. వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీజేపీ త‌ర‌ఫునే బ‌రిలోకి దిగుతాన‌ని ఓ సంద‌ర్భంలో అన్న‌ట్లు గుర్తు ! ఏదేమ‌యిన‌ప్ప‌టికీ జ‌గ‌న్ వ్యూహం మ‌రియు ఒత్తిడి కార‌ణంగా పీఎంఓ కూడా ర‌ఘురామ‌ను ప‌క్క‌న‌పెట్టింది.

మ‌రోవైపు రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌లు ఉన్నందున అత్యంత కీల‌కం అయిన ఓటింగ్ శాతం వైసీపీకి ఉన్నందున జ‌గ‌న్ కు బీజేపీ ప్రాధాన్యం ఇవ్వ‌డం మ‌ళ్లీ ప్రారంభించింది అని తెలుస్తోంది. దీంతో కొత్త వ్యూహంలో భాగంగా బీజేపీ అటు జ‌గ‌న్ ను ఇటు మిగతా అనుకూల పార్టీల‌నూ ప్ర‌స‌న్నం చేసుకునే ప‌నిలో ప‌డింది.

ఎపార్ట్ ఫ్ర‌మ్ దిస్..

వ‌చ్చే ఎన్నిక‌ల్లోగానే ఆర్ఆర్ఆర్ పై బ‌హిష్కృత వేటు వేయాల‌న్న‌ది జ‌గ‌న్ ఆలోచ‌న‌గా తెలుస్తోంది. క్ష‌త్రియ సంఘాలు కూడా ట్రిపుల్ ఆర్ కు పె ద్ద‌గా మ‌ద్ద‌తు ఇవ్వ‌డం లేద‌నుకోవాలి. బీజేపీకి అనుగుణంగా ఉండే సంఘాలే ఆర్ఆర్ఆర్ కు మ‌ద్ద‌తు ఇస్తూ వ‌స్త‌న్నాయి కానీ వైసీపీకి అనుగుణంగా ఉండే సంఘాలు మాత్రం అస్స‌లు ఆయ‌నంటే మొగ్గు చూప‌డం లేదు.

అదేవిధంగా వైఎస్ ఆత్మ బంధువు కేవీపీకి ద‌గ్గ‌ర‌గా ఉండే మ‌నుషులు కూడా ఇవాళ వైసీపీ వైపే ఉన్నారు. వాళ్లు కూడా తూగో,ప‌గోల‌లో ఉన్నా కూడా ట్రిపుల్ ఆర్ కు మ‌ద్ద‌తు ఇచ్చేందుకు సాహ‌సించ‌డం లేదు. మీ భాష బాలేదు క‌దా దిద్దుకోండి అని ఇవాళ కూడాఓ మీడియా ప్ర‌తినిధి చెప్పినా ఆయ‌న వినిపించుకోలేని ధోర‌ణిలోనే ఉన్నారు.
Tags:    

Similar News