32 ఏళ్లుగా దీవిలో ఒంటరిగా జీవిస్తున్న వృద్ధుడు.. కారణం ఏంటంటే?

Update: 2021-04-28 17:30 GMT
చుట్టూ అందమైన ప్రపంచం. సహజ సిద్ధ రంగులను పులుముకున్న ప్రకృతి. పెద్దగా జనసంచారం లేని ప్రాంతం. చుట్టూ సముద్రం. ఇంతటి గొప్ప ప్రదేశంలో ఒకరోజు గడిపినా చాలు. కానీ ఆ వృద్ధుడు మాత్రం ఏకంగా 32 ఏళ్లు నివసించారు. మధ్యధరా సముద్రం దగ్గరి ప్రకృతి రమణీయతే తనను కట్టిపడేసిందిని చెప్పారు 81 ఏళ్ల మారో మొరాండీ. ఆయనను ఇటలీ రాబిన్‌సన్ క్రూసో అని పిలుస్తున్నారు.

మొరాండీ 1989లో దక్షిణ ఫసిపిక్ సముద్రానికి వెళ్తుండగా మార్గం మధ్యలో ఆయన నావ చెడిపోయింది. అలా ఓ దీవిలోని చిక్కిపోయారు. చివరకు అక్కడే మకాం పెట్టేశారు. అదే సమయానికి అక్కడ కేర్ టేకర్ గా పనిచేసే ఓ పెద్దాయన పదవీ విరమణ పొందుతున్నారు. ఇక తదుపతి ఆ బాధ్యతలను మొరాండీ చేపట్టాలని నిర్ణయించుకున్నారు. తన పాడైన పడవను అమ్మేసి ఓ ఇంటిని ఏర్పాటు చేసుకున్నారు. రెండో ప్రపంచం యుద్ధం నాటి ఓ షెల్టర్ ని తన నివాసానికి అనుకూలంగా మార్చుకున్నారు.

ఆ అందమైన దీవిలో అలా 32 ఏళ్లు గడిపారు. ఈ సమయంలో చాలా అవస్థలు పడ్డానని చెబుతున్నారు మొరాండీ. ప్రకృతి చూపించిన విలయ తాండవానికి కొన్నిసార్లు చాలా ఇబ్బంది పడినట్లు వెల్లడించారు. ఆ దీవి రమణీయత కోసం చాలా కష్టపడి పనిచేశారు. దీవిలో మొరాండీ జీవిస్తున్న విషయం 2016లో అందరికీ తెల్సింది. ఇక ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలంటూ నోటీసులు అందాయి. ఆయన న్యాయపోరాటానికి దిగారు. తనకు అనుకూలంగా చాలా మంది ఉన్నారు.

లా మద్దలేనా ఆర్చిపెలాగో నేషనల్ పార్క్ ఇచ్చిన నోటీసులపై న్యాయ పోరాటం జరిగింది. ఆ దీవి పార్కుకు సంబంధించినదేనని కోర్టు వ్యాఖ్యానించింది.  చేసేది లేక ఆ ప్రాంతాన్ని వదలడానికి సిద్ధమయ్యారు ఆయన. ఈ సంఘటనతో తన జీవితంలో ఎలాంటి మార్పు రాదని ఆయన తెలిపారు. 'షాపింగ్ చేస్తా, మళ్లీ సముద్రాన్ని చూస్తా, నేను నా లాగే జీవిస్తానని' పేర్కొన్నారు. అలా 32 ఏళ్లపాటు దీవిలోనే ఒంటరిగా, హాయిగా జీవించారు.
Tags:    

Similar News