ప్రాంతాలతో సంబంధం లేకుండా కొందరు నేతలకు పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. పెద్ద పెద్ద పదవులు చేపట్టనప్పటికి ఒక తరహా గ్లామర్ కొందరు నేతలకు సాధ్యం. అలాంటి వారిలో ఆనం వివేకానందరెడ్డి ఒకరు. తన మాటలతో.. చేతలతో ఆయన తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. కుర్రాడి మాదిరి వ్యవహరించే ఆనం ఆనారోగ్యానికి గురయ్యారు.
ఆయన తీవ్ర అస్వస్థతకు గురి కావటంతో హైదరాబాద్ లోని స్టార్ ఆసుపత్రిలో చేర్చారు. ఆయన ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. ఆనం ఆరోగ్య పరిస్థితి గురించి తెలిసిన ఏపీ మంత్రి లోకేశ్ ఆనంను పరామర్శించారు.
అక్కడి వైద్యులతో మాట్లాడి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఒక హవా నడిపిన ఆనం సోదరుల్లో ఒకరు. ఆనం బదర్స్ లో పెద్దవాడైన వివేకానంద రెడ్డి తీరు మిగిలిన నేతలకు భిన్నంగా ఉంటుంది. పెద్దోడైన వివేకతో పోలిస్తే చిన్నోడు ఆనం రామనారాయణ రెడ్డి తీరు భిన్నం. పెద్దాయన టేకిట్ ఈజీ పాలసీతో వ్యవహరిస్తే.. చిన్నోడైన రామనారాయణ మాత్రం ఆచితూచి అన్నట్లుగా వ్యవహరిస్తుంటారు.
మాట్లాడే ప్రతి మాటను పొందిగ్గా మాట్లాడటం రామనారాయణ తీరు అయితే.. అందుకు భిన్నంగా తనకేం అనిపిస్తే ఆ మాటను అనేయటం వివేకలో కనిపిస్తుంది. నిత్యం హుషారుగా ఉండే వివేక ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందన్న వార్త ఇప్పుడు అందరిలోనూ విస్మయాన్ని రేకెత్తిస్తోంది. ఆయన ఆరోగ్యం కుదుట పడాలని ఆశిద్దాం.