బిగ్ బ్రేకింగ్... రేవతి కుటుంబానికి రూ.2 కోట్ల సాయం!

సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు తొమ్మిదేళ్ల శ్రీతేజ్ కిమ్స్ లో చికిత్స పోందుతున్నారు

Update: 2024-12-25 09:46 GMT

సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు తొమ్మిదేళ్ల శ్రీతేజ్ కిమ్స్ లో చికిత్స పోందుతున్నారు. ఈ సమయంలో ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు శ్రీతేజ్ ను పరామర్శిస్తున్నారు. ఈ సమయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బాధిత కుటుంబానికి రూ.25 లక్షలు సాయం అందించారు.

ఇదే సమయంలో... 'పుష్ప-2' నిర్మాతలు బాలుడిని పరామర్శించి రూ.50 లక్షల చెక్ ను మంత్రి కోమటిరెడ్డి సమక్షంలో అందజేశారు. ఈ విషయాలపై స్పందించిన బాలుడి తండ్రి భాస్కర్... వీరితో పాటు అల్లు అర్జున్ రూ.10 లక్షల డీడీ అందించినట్లు తెలిపారు. ఈ సమయంలో.. తాజాగా రూ.2 కోట్ల సాయం అందజేశారు.

అవును... సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో బాధిత కుటుంబానికి రూ.2 కోట్ల సాయం అందజేస్తున్నట్లు నిర్మాత అల్లు అరవింద్ తెలిపారు. ఈ సందర్భంగా కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ ను పరామర్శించిన అనంతరం ఆయన ఈ ప్రకటన చేశారు. ఇందులో మూడు వాటాలున్నట్లు తెలిపారు!

ఇందులో భాగంగా.. అల్లు అర్జున్ తరుపున రూ.కోటి.. పుష్ప-2 నిర్మాత తరుపున రూ.50 లక్షలు.. దర్శకుడు సుకుమార్ తరుపున రూ.50 లక్షలు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. దీనికి సంబంధించిన చెక్కులను దిల్ రాజుకు అల్లు అరవింద్ అందజేశారు.

Tags:    

Similar News