సినిమాను చూసి ఆరేళ్ల పాపను చంపేసిన మైనర్
ఆరేళ్ల చిన్నారిని హత్య చేసిన ఉదంతంలో నెలకొన్న పీటముడి వీడిపోయింది. అయితే.. ఈ కేసును విచారించిన పోలీసులు సైతం షాక్ తినే అంశాలు విచారణలో వెలుగుచూశాయి;
ఆరేళ్ల చిన్నారిని హత్య చేసిన ఉదంతంలో నెలకొన్న పీటముడి వీడిపోయింది. అయితే.. ఈ కేసును విచారించిన పోలీసులు సైతం షాక్ తినే అంశాలు విచారణలో వెలుగుచూశాయి. మహారాష్ట్రలోని పాలిఘర్ ప్రాంతానికి చెందిన ఆరేళ్ల బాలిక మిస్సింగ్ కేసు నమోదైంది. ఆరేళ్ల సదరు బాలిక శనివారం సాయంత్రం నుంచి కనిపించట్లేదని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులకు బాధిత బాలికను బంధువైన పదమూడేళ్ల మైనర్ కుర్రాడు తనతో తీసుకెళుతున్న విషయాన్ని గుర్తించారు.
అతడ్ని ప్రశ్నించగా పోలీసుల్ని తప్పుదారి పట్టేలా చేశారు. ఇదిలా ఉండగా.. స్థానిక శ్రీరామ్ నగర్ గుట్టలో గుర్తు తెలియని చిన్నారి డెడ్ బాడీ ఉండటం.. మిస్ అయిన చిన్నారేనని గుర్తించారు. దీంతో మరోసారి మైనర్ బాలుడ్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. అర్థం లేని సమాధానాలు చెప్పినప్పటికి.. చివరకు అసలు విషయాన్ని వెల్లడించారు.
తన బంధువైన ఆరేళ్ల పాపను అందరూ ముద్దు చేయటాన్ని తట్టుకోలేకపోయాడు. ఈర్షకు గురైన అతడు.. బాలీవుడ్ మూవీ రామన్ రాఘవ్ మూవీలోని సీరియస్ కిల్లర్ ను స్ఫూర్తిగా తీసుకొన్నారు. చిన్నారికి మాయ మాటలు చెప్పి తనతో తీసుకెళ్లాడు. గుట్ట మీద తీసుకెళ్లి గొంతు కోసి హతమార్చాడు. ఆ తర్వాత బండరాయితో ఆమె ముఖాన్ని ఛిద్రం చేశాడు. మైనర్ బాలుడు చెప్పిన విషయాల్ని విన్న బాధిత కుటుంబం షాక్ కు గురైంది. తమతో ఉండే ఒక చిన్న పిల్లాడు ఇంత దారుణంగా చిన్నారిని హత్య చేయటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది.