బాబూ ఈజ్ గ్రేట్ : వైసీపీ కార్యకర్తకు సీఎం రిలీఫ్ ఫండ్ సాయం !
కరడు కట్టిన వైసీపీ కార్యకర్తకు టీడీపీ ప్రభుత్వం నుంచి ఆర్ధిక సాయం అందడం అంటే నిజంగా ఇది ఆలోచించాల్సిన విషయంగానే చూడాలని అంటున్నారు.;
ఏపీ రాజకీయాలు నిట్టనిలువునా చీలిపోయాయి. పార్టీలు పై స్థాయి నుంచి దిగువ స్థాయి దాకా కనిపిస్తున్నాయి. క్షేత్ర స్థాయిలో సైతం పొలిటికల్ వార్ అలాగే సాగుతోంది. ఈ నేపథ్యంలో చూస్తే కనుక ఉప్పు నిప్పులా ఉండే టీడీపీ వైసీపీల మధ్యలో ఈ రకమైన సందర్భం చోటు చేసుకోవడం రాజకీయ విడ్డూరం కంటే కూడా చంద్రబాబు సీఎం గా మానవత్వంతో పనిచేస్తున్నారు అని చెప్పాల్సి ఉంటుందని అంటున్నారు.
కరడు కట్టిన వైసీపీ కార్యకర్తకు టీడీపీ ప్రభుత్వం నుంచి ఆర్ధిక సాయం అందడం అంటే నిజంగా ఇది ఆలోచించాల్సిన విషయంగానే చూడాలని అంటున్నారు. అది అలా జరిగింది. అందరూ నోళ్ళు వెళ్ళబెట్టేలా వైసీపీ కార్యకర్తకు సాయం ఆర్ధికంగా అందింది. ఈ విషయం వివరాల్లోకి వెళ్తే కనుక కళ్యాణదుర్గం లో బాలవెంకటాపురం గ్రామానికి చెందిన జిలాని బాషా వైసీపీ కార్యకర్త స్థానికంగా ఆ పార్టీకి గట్టి నాయకుడిగా ఉన్నారు. ఆయన గత కొంతకాలంగా చూస్తే కనుక తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నారు.
ఆయనకు వైద్య పరీక్షల కోసం ఇరవై లక్షల రూపాయలు అవసరం అవుతాయి. జిలానీ చూస్తే కష్టపడిన కుటుంబం నుంచి వచ్చారు. దాంతో ఆయనకు ఇది అధిక భారంగా మారింది. దాంతో ఆయన స్థానికంగా ఉన్న టీడీపీ కార్యకర్తలను సంప్రదించాడు. వారంతా కలసి ఆయనను వెంటబెట్టుకుని మరీ స్థానిక టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు వద్దకు తీసుకెళ్లారు.
ఆయన వెంటనే జిలానీ పరిస్థితి చూసి తాను చేతనైనంత సాయం చేస్తాను అని చెప్పారు. ఆ వెంటనే ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళి ఏకంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి పది లక్షల రూపాయల నిధులను ఆర్ధిక సాయంగా జిలానీకి మజూరు అయ్యేలా చూశారు. ఈ మొత్తం ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి వైద్యపరంగా ఇబ్బందులు పడుతున్న జిలానీకి ఆ చెక్కును సైతం ఎమ్మెల్యే అందజేశారు.
ఇది నిజంగా జిలానీకి మళ్ళీ ఆరోగ్యాన్ని కొత్త జన్మని ఇచ్చినట్లే అని అంటున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నపుడు టీడీపీ కార్యకర్తలను అణచివేయడమే కాకుండా ఆర్ధికంగా కూడా బలహీనం చేశారు. అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టారు. కానీ అదే టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇలాంటి ప్రతీకార చయ్రలను పక్కన పెట్టి ప్రత్యర్ధి పార్టీకి చెందిన కార్యకర్తకు సైతం మానవత్వంలో సాయం చేయడం గ్రేట్ అంటున్నారు. ఈ విషయంలో బాబు ఈజ్ గ్రేట్ అని కూడా అంటున్నారు.
పార్టీలు చూడం, కులం మతం చూడం, మానవత్వంతోనే అలోచిస్తామని చంద్రబాబు చెప్పడం ద్వారా కొత్త స్పూర్తిని ఇచ్చారని అంటున్నారు. రాజకీయం అంటే ప్రతీకారం కాదని అధికారం అంటే అణచివేత కాదని బాబు ఈ విధంగా రుజువు చేశారని అంటున్నారు.