ఆనం కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత ఆనం వివేకానంద రెడ్డి (67) కన్నుమూశారు. నాలుగు నెలలుగా ఆయన ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న ఆయన నెల రోజులుగా హైదరాబాద్ లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మూడు, నాలుగు రోజులుగా ఆరోగ్యం మరింత క్షీణించింది. ఏప్రిల్ 25వ తేదీ బుధవారం ఉదయం 10 గంటల సమయంలో తుది శ్వాస విడిచారు.
1950 డిసెంబర్ 25న జన్మించిన ఆనం 1982లో ఆప్కాబ్ చైర్మన్ గా రాజకీయ జీవితం ప్రారంభించారు. ఆనం వివేకానందరెడ్డి నెల్లూరు నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా పని చేశారు. 1999 - 2004 - 2009లో వరసగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009లో చివరి సారిగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇటీవలే తన సోదరుడు ఆనం రామనారయణ రెడ్డితో కలిసి టీడీపీలో జాయిన్ అయ్యారు. ఎప్పుడూ చలాకీగా ఉంటారు. సెటైర్లు వేస్తూ.. అందర్నీ నవ్విస్తుంటారు. కార్యకర్తలతో కలిసిపోయి తిరుగుతుంటారు. ఎమ్మెల్యే అన్న హోదాని పక్కనపెట్టి మరీ జనంలో కలిసిపోయి తిరిగేవారు. రేపు నెల్లూరులో ఆయన అంత్యక్రియలు జరనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయనకు ఇద్దరు కుమారులు.