తమ రాజకీయ భవిష్యత్తుపై క్లారిటీ ఇచ్చారు నెల్లూరు జిల్లాకు చెందిన టీడీపీ నేతలు ఆనం వివేకానందరెడ్డి. కాంగ్రెస్ హయాంలో నెల్లూరు రాజకీయాల్ని ఒక చక్రం తిప్పిన ఆనం బ్రదర్స్‌కు టీడీపీలో చేరిన తర్వాత ఒకటి తర్వాత ఒకటిగా ఎదురవుతున్న షాకుల నేపథ్యంలో ఆయన పార్టీ నుంచి వీడిపోతారన్న వార్తలు సోషల్ మీడియాలో గుప్పుమన్న సంగతి తెలిసిందే.
ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీటును ఆశించిన భంగపడిన వివేకానంద.. సీఎం బాబు తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని.. ఆయన పార్టీ నుంచి బయటకు వెళ్లాలని భావిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఈ వార్తల్ని ఆనం బ్రదర్స్ లో ఎవరూ ఖండించకపోవటంతో అంతకంతకూ పెరుగుతూ వచ్చాయి. ఈ వార్తల జోరు ఎక్కడి వరకూ వెళ్లిందంటే.. పవన్ కల్యాణ్ జనసేనలో ఆనం బ్రదర్స్ చేరటానికి సిద్ధం అవుతున్నారన్న వార్తలు పుట్టుకొచ్చాయి. మరికాస్త ఆలస్యం చేస్తే.. ఈ వార్తలు తమను మరింత ఇబ్బంది పెడతాయని ఫీలయ్యారో ఏమో కానీ.. ఆనం వివేకానంద తాజాగా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తమ పొలిటికల్ ఫ్యూచర్ గురించి క్లారిటీ ఇచ్చారు.
తాము తెలుగు దేశం పార్టీలోనే ఉంటామని..పార్టీని వీడిపోతామని వస్తున్న వార్తల్లో నిజం లేదని.. అదే విషయాన్ని చంద్రబాబుకు స్పష్టం చేసినట్లుగా వెల్లడించారు. తమ సేవల్ని ఎలా వినియోగించుకోవాలో బాబుకు బాగా తెలుసన్న ఆనం వివేకానంద.. వచ్చే ఎన్నికల్లో తమకిచ్చే స్థానాల్లో గెలిచి తమ సత్తా చాటతామన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/