మంచి పేరు కావాలట.. చెప్పమంటున్న ఆనంద్ మహీంద్రా

Update: 2022-10-08 04:35 GMT
వ్యాపార రంగంలో దూసుకుపోతూ.. క్షణం తీరిక లేకుండా ఉన్నప్పటికీ.. సోషల్ మీడియాలో అంతే స్పీడ్ గా రియాక్టు అయ్యే పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా.

ఇటీవల కాలంలో ఆయన కంపెనీ విడుదల చేస్తున్న కార్ మోడళ్లు ఒకటి తర్వాత ఒకటి చొప్పున సక్సెస్ అవుతున్నాయి. తాజాగా ఆయన కంపెనీ విడుదల చేసిన కారు స్కార్పియో - ఎన్. సరికొత్త స్కార్పియో ఎన్ కారు తాళాల్ని అందుకున్న వేళ.. ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు.

తనకిది బిగ్ డే అని.. కొత్త స్కార్పియోను తాను రిసీవ్ చేసుకున్నానని.. అయితే దానికో మాంచి పేరు కావాలన్నారు. 'మంచి పేరును ఎవరైనా పెట్టగలరు. మంచి పేరు సూచించే వారికి వెల్ కం' అంటూ ఆయన ఆహ్వానించారు. తాను రిసీవ్ చేసుకున్న కారు ఫోటోను షేర్ చేసుకున్న ఆనంద్ మహీంద్రా.. మంచి పేరు పెట్టాలని కోరటం ఆసక్తికరంగా మారింది.

పలు ఫీచర్లతో విడుదలకు సిద్దమైన ఈ కారు బుకింగ్స్ ను జులై 31న ప్రారంభించటం.. తొలి నిమిషంలోనే ఏకంగా పాతిక వేల వాహనాలు బుక్ కావటం అప్పట్లో హాట్ టాపిక్ అయ్యింది.

అంతేకాదు.. ఈ మోడల్ దేశంలో అత్యంత వేగంగా బుకింగ్ అయిన వాహన రికార్డును సొంతం చేసుకుంది. ఈ వాహనం పెట్రోల్.. డీజిల్.. రెండు వెర్షన్ లోనూ విడుదల చేస్తున్నారు.

పెట్రోల్ ఎంటీ వెర్షన్ రూ.11.99 లక్షల నుంచి షురూ అయితే.. డీజిల్ ఎంటీ వేరియంట్ రూ.19.49 లక్షల వరకు ఉంటుంది. మరి.. ఆనంద్ మహీంద్రా కోరుకున్నట్లు దీనికి మాంచి పేరు పెట్టేవారెవరో?



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News