ఆనంద్ మహీంద్రా మనసు దోచిన మగ్ లో ఏముంది?

Update: 2022-08-11 04:29 GMT
దేశంలో వ్యాపార దిగ్గజాలకు కొదవ లేదు. పేరున్న చాలామంది పేరు మాత్రమే తెలుస్తుంది. కానీ.. వారి వ్యక్తిత్వంతో తమ బ్రాండ్ ఇమేజ్ ను మరింత పెంచిన వారిని చూస్తే.. అలాంటి వారు వేళ్ల మీద లెక్కించేంతగా మాత్రమే కనిపిస్తారు. అలాంటి వారిలో ముఖ్యుడిగా చెప్పొచ్చు ఆనంద్ మహీంద్రా.

మహేంద్రా సంస్థల అధినేతగా సుపరిచితుడైన ఆయన.. వ్యాపారంలో ఎంత దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటారో.. ప్రపంచ వ్యాప్తంగా చోటుచేసుకునే పలు పరిణామాల్ని నిశితంగా గమనించటమే కాదు.. సందర్భానికి తగ్గట్లు ఆయా అంశాల్ని ప్రస్తావిస్తూ.. తరచూ వార్తల్లో నిలుస్తుంటారు.

గడిచిన కొన్నేళ్లుగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ.. ఏ సందర్భంలోనూ ట్రోలింగ్ కు.. విమర్శలకు అవకాశం ఇవ్వని అతి కొద్ది మంది ప్రముఖుల్లో ఆనంద్ మహీంద్రా ఒకరుగా చెప్పాలి. ఆయన సెన్సిబులిటీ.. సెన్సాఫ్ హ్యుమర్ దేశ ప్రజల్ని ఆకట్టుకుంటూ ఉంటుంది. తాజాగా ఆయన ఒక పోస్టు చేశారు. అందులో ఉన్న మగ్ ను తాను ఆర్డర్ చేసినట్లుగా పేర్కొన్నారు. నిజానికి ఆ మగ్ ఆకర్షించేలా ఉంది.

ఆలోచనలకు పరిమితులు గీయొద్దనే సూచనను ఎంత తెలివిగా చెప్పారన్న దానికి నిదర్శనంగా ఆ మగ్ ఉందని చెప్పాలి. సదరు కాఫీ మగ్ మీద టిక్ టాక్ టాయ్ ఆటకు చెందిన చిత్రం ఉంది. అందులో క్రాస్ లను కేటాయించిన బాక్స్ దాటి కలిపే వైనం కనిపిస్తుంది. అవుట్ ఆఫ్ ది బాక్స్ మాదిరి ఆలోచించాలన్న మాటకు నిలువెత్తు నిదర్శనంగా ఈ మగ్ ఉండటం ఆకర్షిస్తుంది.

కొన్ని సందర్భాల్లో రూల్స్ ను బ్రేక్ చేయొచ్చు.. కానీ అదెంత తెలివిగా చేయాలన్న విషయాన్ని చెప్పేలా ఉన్న మగ్ ను చూపిస్తూ.. ఆ మగ్ ను తాను తెప్పించుకోనున్నట్లుగా చెప్పారు.

ఆనంద్ మహీంద్రా పెట్టిన ఈ పోస్టుకు నెటిజన్లు పాజిటివ్ గా రియాక్టు కావటమే కాదు.. గ్రేట్ ఐడియా అంటూ అభినందిస్తున్నారు. నెటిజన్ల మనసుల్ని దోచే ఫార్ములా ఏమిటో ఆనంద్ మహీంద్రాకు తెలిసినంతగా మరెవరికీ తెలీదేమో?
Tags:    

Similar News